Breaking: కర్ణాటక సీఎం యడియూరప్పకు కరోనా

|

Aug 03, 2020 | 12:37 AM

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఈ మేరకు తనకు కరోనా సోకినట్లు ట్విటర్ ద్వారా ఆయనే స్వయంగా తెలిపారు.

Breaking: కర్ణాటక సీఎం యడియూరప్పకు కరోనా
Follow us on

ప్రముఖులనూ వదలని వైరస్‌. … కరోనా పేరు వింటేనే జనం వణికిపోతున్నారు. సామాన్యుడి నుంచి సెలబ్రేటీల దాకా మహమ్మారి ధాటికి విలవిలలాడుతున్నారు. కరోనా బారిన పడుతున్న నేతల సంఖ్య అధికమవుతోంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకు ఆదివారం కరోనా నిర్ధారణ కాగా, యూపీ బీజేపీ అధ్యక్షుడు కూడా కరోనాకు గురయ్యారు. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఈ మేరకు తనకు కరోనా సోకినట్లు ట్విటర్ ద్వారా ఆయనే స్వయంగా తెలిపారు. అయితే, ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని, వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నానని యడ్యూరప్ప వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారంతా ఎవరికి వారు స్వీయ నిర్బంధం పాటించాలని ఆయన కోరారు. ప్రజలంతా కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని యడియూరప్ప కోరారు.