బిగ్‌బాస్‌ షో ప్రసారాలు నిలిపివేసే వరకు పోరాటం ఆపను.. శ్వేతారెడ్డి

| Edited By:

Jul 23, 2019 | 3:35 PM

తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో ” బిగ్‌బాస్‌”పై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ షో ప్రసారాలు నిలిపివేసే వరకు తన పోరాటం ఆపే ప్రసక్తే లేదన్నారు జర్నలిస్టు శ్వేతారెడ్డి. నటి గాయత్రి గుప్తా, పీఓడబ్ల్యూ సంధ్యతో కలిసి ఆమె హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. బిగ్‌బాస్‌లో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం నడుస్తుందని ఆరోపించారు శ్వేతారెడ్డి . తాను లేవనెత్తిన ఈ అంశానికి పెద్దఎత్తున మద్దతు లభిస్తోందని.. ఈ షో ప్రసారాలు నిలిపివేసే వరకు తన పోరాటం ఆపనన్నారు. […]

బిగ్‌బాస్‌ షో ప్రసారాలు నిలిపివేసే వరకు పోరాటం ఆపను.. శ్వేతారెడ్డి
Follow us on

తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో ” బిగ్‌బాస్‌”పై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ షో ప్రసారాలు నిలిపివేసే వరకు తన పోరాటం ఆపే ప్రసక్తే లేదన్నారు జర్నలిస్టు శ్వేతారెడ్డి. నటి గాయత్రి గుప్తా, పీఓడబ్ల్యూ సంధ్యతో కలిసి ఆమె హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. బిగ్‌బాస్‌లో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం నడుస్తుందని ఆరోపించారు శ్వేతారెడ్డి . తాను లేవనెత్తిన ఈ అంశానికి పెద్దఎత్తున మద్దతు లభిస్తోందని.. ఈ షో ప్రసారాలు నిలిపివేసే వరకు తన పోరాటం ఆపనన్నారు.

తెలుగు బిగ్‌బాస్ షోకు వ్యాఖ్యాతగా నాగార్జున, తమిళ బిగ్‌బాస్‌కు కమల్‌హసన్ వంటి సీనియర్ నటులు వ్యవహరించడం బాధకరమని శ్వేతారెడ్డి వ్యాఖ్యానించారు. మహిళల ఆత్మాభిమానాన్ని కించపరిచేలా ఉన్న ఈ షో నిలిపివేయాలన్న తమ డిమాండ్‌పై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్ వంటివారు కూడా మద్దతు ప్రకటించారన్నారు. ఇదిలా ఉంటే ఈనె ల24,25 తేదీల్లో ప్రధాని మోదీ తమిళనాడుకు రానున్న నేపథ్యంలో ఆయనను కలిసి బిగ్‌బాస్‌ షో నిర్వహణ తీరుపై వినతిపత్రం ఇవ్వనున్నట్టు శ్వేతారెడ్డి చెప్పారు.ఇప్పటికే నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి నేత‌ృత్వంలో హైకోర్టును ఆశ్రయించామని, ఈనెల 29న ఈ కేసు విచారణ కూడా జరగనుందన్నారు శ్వేతారెడ్డి.

ఇప్పటికే బిగ్‌బాస్ షో ప్రారంభమై రెండు రోజులైంది. అయితే ఈ షో ప్రసారాల ప్రారంభానికి ముందే జర్నలిస్టు శ్వేతారెడ్డి, నటి గాయత్రీ గుప్తా గత కొన్ని రోజులుగా పలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.