#Jagan offer ఢిల్లీ వెళ్ళొచ్చిన వారికి జగన్ ఆఫర్

|

Mar 31, 2020 | 2:12 PM

ఢిల్లీలో జరగిన తబ్లిఘి జమాత్ సదస్సుకు హాజరైన వారికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. దేశంలో కరోనా తగ్గుతుందన్న సంకేతాలను అటు కేంద్రం, ఇటు కొన్ని రాష్ట్రాలు ఇచ్చి 24 గంటల గడవక ముందే..

#Jagan offer ఢిల్లీ వెళ్ళొచ్చిన వారికి జగన్ ఆఫర్
Follow us on

CM Jagan open offer to Delhi Tablighi Jamath returnees: ఢిల్లీలో జరగిన తబ్లిఘి జమాత్ సదస్సుకు హాజరైన వారికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. దేశంలో కరోనా తగ్గుతుందన్న సంకేతాలను అటు కేంద్రం, ఇటు కొన్ని రాష్ట్రాలు ఇచ్చి 24 గంటల గడవక ముందే తబ్లిఘి జమాత్ సదస్సుకు హాజరైన వారిలో పలువురు ఒకే రోజు పెద్ద సంఖ్యలో మరణించడం అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. తాజా పరిస్థితిపై మంగళవారం ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమీక్ష జరిపారు.

రాష్ట్రంలో కోవిడ్‌–19 విస్తరణ, కొత్తగా నమోదైన కేసుల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కొత్తగా 17 కేసులు నమోదయ్యాయని వివరించిన అధికారులు.. వీరిలో చాలా మంది ఢిల్లీలో నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లీఘి జమాత్‌ సదస్సుకు హాజరైనవారు, వారి కుటుంబ సభ్యులేనని వివరించారు. ఏపీ నుంచి వెళ్లిన వారు, అదేరోజు రైల్లో ప్రయాణం చేసిన వారి వివరాలను సేకరించామని తెలిపిన అధికారులు.. వారిని ట్రేస్ చేసి.. పరీక్షలు జరుపుతున్నామని తెలిపారు. అనుమానం కలిగితే వారిని క్వారెంటైన్‌కు పంపుతున్నామన్నారు.

జమాత్‌ నిర్వాహకులనుంచి, పోలీసులనుంచి, రైల్వే శాఖ నుంచి.. ఇలా వివిధ రకాలుగా సమాచారాన్ని సేకరించి వారిని క్వారంటైన్‌కు, ఐసోలేషన్‌కు తరలిస్తున్నామని అధికారులు అంటున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ అధికార యంత్రాంగానికి పలు సూచనలు చేశారు. ఢిల్లీ వెళ్లినవారు, వారితో కాంటాక్టులో ఉన్నవారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చికిత్స తీసుకోవాలని సీఎం ఆఫర్ ఇచ్చారు. వైద్యం తీసుకుంటే ఎవ్వరికీ ఏం కాదని, వారి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయని సీఎం సూచించారు.