షహీన్ బాగ్ శిశువు మృతి..సీఏఏ నిరసనల్లో విషాదం

సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. షహీన్‌బాగ్‌లో పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు, దీక్షలు చేస్తున్నారు. తల్లితో పాటు ఆ దీక్షలో పాల్గొన్న 4 నెలల శిశువు మృతి చెందాడు. జనవరి 30న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. బట్లా హౌజ్‌ ప్రాంతంలో నివసించే చిరు వ్యాపారి మహ్మద్‌ ఆరిఫ్‌ భార్య నజియా..నాలుగు నెలల శిశువుతో పాటు షహీన్‌బాగ్‌ నిరసనలో పాల్గొనేది. ఐతే జనవరి 30న ఆందోళనల అనంతరం ఇంటికెళ్లి బాబును పడుకోబెట్టి తానూ నిద్రించింది. […]

షహీన్ బాగ్ శిశువు మృతి..సీఏఏ నిరసనల్లో విషాదం

Updated on: Feb 04, 2020 | 8:27 PM

సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. షహీన్‌బాగ్‌లో పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు, దీక్షలు చేస్తున్నారు. తల్లితో పాటు ఆ దీక్షలో పాల్గొన్న 4 నెలల శిశువు మృతి చెందాడు. జనవరి 30న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.

బట్లా హౌజ్‌ ప్రాంతంలో నివసించే చిరు వ్యాపారి మహ్మద్‌ ఆరిఫ్‌ భార్య నజియా..నాలుగు నెలల శిశువుతో పాటు షహీన్‌బాగ్‌ నిరసనలో పాల్గొనేది. ఐతే జనవరి 30న ఆందోళనల అనంతరం ఇంటికెళ్లి బాబును పడుకోబెట్టి తానూ నిద్రించింది. తెల్లవారాక చూస్తే చిన్నారి కదలకుండా విగతజీవిగా పడి ఉన్నాడు. ఢిల్లీలో చలి తీవ్రత తట్టుకోలేక జహాన్‌ మృతి చెందాడు. ఐనా తాను వెనక్కి తగ్గేది లేదంటోంది నజియా. తన మిగిలిన ఇద్దరు బిడ్డల కోసం నిరసనల్లో పాల్గొంటానని చెబుతోంది.