బ్రేకింగ్.. విదేశాల నుంచి వేలాది భారతీయుల తరలింపునకు రంగం సిధ్ధం

| Edited By: Anil kumar poka

May 05, 2020 | 2:41 PM

సుమారు 13 దేశాల్లో చిక్కుబడిన భారతీయుల్లో 14,800 మందిని తిరిగి ఇండియాకు తరలించేందుకు 64 విమానాలను రెడీ చేస్తున్నారు. ఇదొక భారీ పథకం. అమెరికా, ఫిలిప్పీన్స్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బంగ్లాదేశ్, బ్రిటన్, సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్, బహ్రెయిన్, కువైట్ తదితర దేశాలకు ఈ విమానాలు గురువారం బయల్దేరనున్నాయి.

బ్రేకింగ్.. విదేశాల నుంచి వేలాది భారతీయుల తరలింపునకు రంగం సిధ్ధం
Follow us on

సుమారు 13 దేశాల్లో చిక్కుబడిన భారతీయుల్లో 14,800 మందిని తిరిగి ఇండియాకు తరలించేందుకు 64 విమానాలను రెడీ చేస్తున్నారు. ఇదొక భారీ పథకం. అమెరికా, ఫిలిప్పీన్స్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బంగ్లాదేశ్, బ్రిటన్, సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్, బహ్రెయిన్, కువైట్ తదితర దేశాలకు ఈ విమానాలు గురువారం బయల్దేరనున్నాయి.  మాల్దీవులు, గల్ఫ్ దేశాల్లో చిక్కుబడిన భారతీయుల కోసం అప్పుడే మూడు నౌకలు తరలాయి. దేశానికి స్వాతంత్య్రం వఛ్చిన అనంతరం ఇంత పెద్ద తరలింపు ఇదే మొదటిసారి. తొలి రోజున 10 విమానాలు సుమారు రెండున్నర వేల మందిని తీసుకురానున్నాయి.  రెండో రోజున 2,050 మంది చెన్నై, కొచ్చి, ముంబై, అహ్మదాబాద్, బెంగుళూరు, ఢిల్లీ నగరాలను చేరుకోనున్నారు. విమానాల నిర్వహణను బట్టి 200 మంది నుంచి 300 మంది వరకు ప్రయాణికులను అనుమతిస్తారు. అయితే అందరూ విధిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.  కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నవారిని అనుమతించబోరు.  విమానం ఎక్కేముందే అన్ని పరీక్షలూ చేస్తారు.