వైమానిక దాడులపై భారత ప్రభుత్వం కీలక ప్రకటన

|

Feb 26, 2019 | 11:57 AM

న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత్ చేసిన దాడి పట్ల ప్రభుత్వం తరుపున అధికారిక ప్రకటన విడుదలైంది. విదేశాంగ కార్యదర్శి మీడియాతో మాట్లాడుతూ దాడిని ధృవీకరించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో జైషే మహ్మద్ ఉగ్ర సంస్థను ముఖ్యంగా టార్గెట్ చేసినట్టు ఆయన చెప్పారు. పూర్తి వివరాలు తర్వాత తెలియజేస్తామని ఆయన చెప్పారు. ఆయన ఇంకా మాట్లాడుతూ పాకిస్థాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే ఎలాంటి ఉగ్ర సంస్థలను సహించబోమని, వాటిని అంతం చేస్తామని గతంలో పాకిస్థాన్ చెప్పిందని అన్నారు. […]

వైమానిక దాడులపై భారత ప్రభుత్వం కీలక ప్రకటన
Follow us on

న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత్ చేసిన దాడి పట్ల ప్రభుత్వం తరుపున అధికారిక ప్రకటన విడుదలైంది. విదేశాంగ కార్యదర్శి మీడియాతో మాట్లాడుతూ దాడిని ధృవీకరించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో జైషే మహ్మద్ ఉగ్ర సంస్థను ముఖ్యంగా టార్గెట్ చేసినట్టు ఆయన చెప్పారు. పూర్తి వివరాలు తర్వాత తెలియజేస్తామని ఆయన చెప్పారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ పాకిస్థాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే ఎలాంటి ఉగ్ర సంస్థలను సహించబోమని, వాటిని అంతం చేస్తామని గతంలో పాకిస్థాన్ చెప్పిందని అన్నారు. కానీ ఆ మాటను పాక్ నిలబెట్టుకోలేదని చెప్పారు.

మీడియా వారి నుంచి ఎటువంటి ప్రశ్నలకూ ఆయన అవకాశం ఇవ్వలేదు. ప్రభుత్వం తరుపున ప్రకటన మాత్రమే చేసి వెళ్లిపోయారు. అయితే ఇప్పటి వరకూ చెప్పుకుంటూ వస్తున్న దాడులను ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినట్టు అయ్యింది.