ఈ సాయంత్రం దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై భారీ లైవ్ బ్యాండ్ ఈవెంట్

|

Sep 26, 2020 | 8:43 AM

భాగ్యనగరం సిగలో మరో మణిహారంగా నిలిచిన దుర్గంచెరువు తీగల వంతెన పై ఈ(శనివారం) సాయంత్రం 5.30 గంటలకు భారీ స్థాయిలో కల్చరల్ ఈవెంట్ జరుగబోతోంది. ఆర్మీ సెరమోనియల్ సింఫోనీ బ్యాండ్ ఈ ప్రదర్శన ఇవ్వబోతుంది. ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో జరుగబోతోన్న ఈ ఈవెంట్ ను నార్తన్ బార్డర్ లో విధులు నిర్వహిస్తున్న భారతీయ సైనికులు, జి.హెచ్.యం.సి శానిటేషన్ కరోనా వారియర్ల సేవల నిర్వహణకు సంఘీభావాన్ని తెలియజేసేలా నిర్వహించతలపెట్టారు. ఈ లైవ్ బ్యాండ్ ప్రదర్శనకు ప్రజలందరు ఉత్సహంగా హాజరుకావాలని […]

ఈ సాయంత్రం దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై భారీ లైవ్ బ్యాండ్ ఈవెంట్
Follow us on

భాగ్యనగరం సిగలో మరో మణిహారంగా నిలిచిన దుర్గంచెరువు తీగల వంతెన పై ఈ(శనివారం) సాయంత్రం 5.30 గంటలకు భారీ స్థాయిలో కల్చరల్ ఈవెంట్ జరుగబోతోంది. ఆర్మీ సెరమోనియల్ సింఫోనీ బ్యాండ్ ఈ ప్రదర్శన ఇవ్వబోతుంది. ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో జరుగబోతోన్న ఈ ఈవెంట్ ను నార్తన్ బార్డర్ లో విధులు నిర్వహిస్తున్న భారతీయ సైనికులు, జి.హెచ్.యం.సి శానిటేషన్ కరోనా వారియర్ల సేవల నిర్వహణకు సంఘీభావాన్ని తెలియజేసేలా నిర్వహించతలపెట్టారు. ఈ లైవ్ బ్యాండ్ ప్రదర్శనకు ప్రజలందరు ఉత్సహంగా హాజరుకావాలని నిర్వాహకులు కోరారు. 45 నిమిషాల పాటు ఈ ప్రదర్శన ఉంటుంది.

వందేమాతరంతో ప్రారంభించి పలు దేశ భక్తి, భారతీయ, పాశ్చాత్య గీతాల సంగీతాన్ని ప్రదర్శించి “జయ హో ” తో ముగిస్తారు. ఆర్మీ బ్యాండ్ ప్రదర్శన అనంతరం Ms.అనీశా సారధ్యంలో స్థానిక బ్యాండ్, ఇండియన్, వెస్ట్రన్ పాటలను ప్రజల వినోదం కోసం ప్రదర్శిస్తారని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ అర్వింద్ కుమార్ తెలిపారు. కాగా, ఈ వంతెనను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ శుక్రవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే.