నవంబర్‌లో భారత్‌కు రానున్న ట్రంప్..?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నవంబర్ లేదా వచ్చే ఏడారి జనవరిలో ఈ టూర్ ఉండే ఛాన్స్ ఉంది. ఇటీవల అమెరికా-భారత్‌ల మధ్య వర్తక వాణిజ్య వ్యవహారాల్లో కొంత ప్రతిష్టంభన ఏర్పడింది. దీనిపై అమెరికా అధ్యక్షడు ట్రంప్ కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు ప్రధాని మోదీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల నిమిత్తం సెప్టెంబర్‌లో న్యూయార్క్‌కు వెళ్లనున్నారు. అక్కడ ట్రంప్‌తో భేటీ అవకాశాలు […]
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నవంబర్ లేదా వచ్చే ఏడారి జనవరిలో ఈ టూర్ ఉండే ఛాన్స్ ఉంది. ఇటీవల అమెరికా-భారత్‌ల మధ్య వర్తక వాణిజ్య వ్యవహారాల్లో కొంత ప్రతిష్టంభన ఏర్పడింది. దీనిపై అమెరికా అధ్యక్షడు ట్రంప్ కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు ప్రధాని మోదీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల నిమిత్తం సెప్టెంబర్‌లో న్యూయార్క్‌కు వెళ్లనున్నారు. అక్కడ ట్రంప్‌తో భేటీ అవకాశాలు కూడా లేకపోలేదు.
అయితే తమ దేశంనుంచి దిగుమతి అవుతున్న వస్తువులపై అధికంగా పన్నులు వసూలు చేస్తోందని భారత్‌ను ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో మన దేశాన్ని జీపీఎఫ్ నుంచి కూడా తొలగించారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటనపై మాత్రం మరిన్ని వివరాలు అందాల్సిఉంది.