భారత్‌-చైనా సైన్యాల లెఫ్టినెంట్‌ జనరల్ భేటీ

సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలకు కారణమైన డ్రాగన్ దేశం, కవ్వింపుల చర్యలను కొనసాగిస్తోంది. అంతే ధీటుగా భారత్ చైనా కుయుక్తులను తిప్పికొడుతోంది. ఇవాళ మరోసారి ఉద్రిక్తతలను తగ్గేందుకు భారత్, దేశాల ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు.

భారత్‌-చైనా సైన్యాల లెఫ్టినెంట్‌ జనరల్ భేటీ

Updated on: Jul 14, 2020 | 2:40 PM

సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలకు కారణమైన డ్రాగన్ దేశం, కవ్వింపుల చర్యలను కొనసాగిస్తోంది. అంతే ధీటుగా భారత్ చైనా కుయుక్తులను తిప్పికొడుతోంది. ఇవాళ మరోసారి ఉద్రిక్తతలను తగ్గేందుకు భారత్, దేశాల ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు.
ఎల్‌ఏసీ వద్ద నుంచి బలగాలను వెనక్కి మళ్లించే విషయమై భారత్‌-చైనా సైన్యాల లెఫ్టినెంట్‌ జనరల్ సమావేశమవుతున్నారు. తూర్పు లద్దాఖ్‌లో ఎల్‌ఏసీ వెంబడి భారత భూభాగం వైపున ఉన్న చుషూల్‌లో ఈ చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను చల్లార్చడం, బలగాల ఉపసంహరణ తదితర అంశాలపై విధివిధానాలను ఖరారు చేయడమే లక్ష్యంగా ఈ చర్చలు జరుగుతున్నట్లు భారత ప్రభుత్వవర్గాలు తెలిపాయి. మరోవైపు చైనా సైన్యం ఇప్పటికే గోగ్రా, హాట్‌ స్ప్రింగ్స్‌, గల్వాన్‌లోయ నుంచి తన బలగాలను వెనక్కి రప్పించుకుంది. ఫింగర్‌-4, పాంగాంగ్‌ సరస్సుల వద్ద సైనికుల సంఖ్యను తగ్గించింది. ఇక పూర్తి స్థాయిలో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.