AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IT returns: ఆదాయపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. మళ్లీ ఐటీ రిటర్న్ ఫైలింగ్ గడువు పెంపు..ఎప్పటివరకూ అంటే..

Income Tax Returns: ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది.

IT returns: ఆదాయపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. మళ్లీ ఐటీ రిటర్న్ ఫైలింగ్ గడువు పెంపు..ఎప్పటివరకూ అంటే..
It Returns Date Extension
KVD Varma
|

Updated on: Sep 09, 2021 | 8:18 PM

Share

Income Tax returns filling: ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఇటీవల ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలుకు సంబంధించి సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువును పొడిగించింది. అయితే, కొత్త ఐటీ పోర్టల్‌లో సమస్యల కారణంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, గడువు తేదీని మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి డిసెంబర్ 31వ తేదీ వరకూ గడువు ఇస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.

కొత్త ఐటీ వెబ్ సైట్‌లో ఎలాంటి టెక్నికల్ సమస్యలు లేకుండా సెప్టెంబర్ 15వ తేదీ వరకు సిద్ధం చేయాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ ఐటీ రిటర్న్స్ లో ఇప్పటివరకూ తలెత్తిన ఇబ్బందుల దృష్ట్యా పెద్ద సంఖ్యలో ప్రజలు రిటర్న్స్ దాఖలు చేయలేకపోయారు. అందువలన మరింత సమయం రిటర్న్స్ దాఖలుకు కావాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చారు. దీంతో ఇప్పుడు కేంద్రం ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువును డిసెంబర్ 31 వరకూ పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం గడువును డిసెంబర్ 31 పొడిగించింది. ఇకపై గడువును పెంచే అవకాశం లేదు. అందువల్ల మీరు ఆ సమయంలోగా కూడా మీ రిటర్నులను దాఖలు చేయడంలో విఫలమైతే, మీరు ఆలస్యంగా పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి రూ. 5,000 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ అందించిన సమాచారం ప్రకారం, పన్ను చెల్లింపుదారుల ద్వారా ITR ని దాఖలు చేయడానికి గడువు తేదీ సెప్టెంబర్ 30, 2021 వరకు పొడిగించడం జరిగింది. అయితే, సెక్షన్ 139 ప్రకారం ఆదాయ వివరాల్ని అందించాల్సిన వ్యక్తి ఆ పని సమయంలోగా పూర్తి చేయలేకపోతే వారు ఆదాయపు పన్ను శాఖ చట్టం ప్రకారం, చెల్లించాల్సిన పన్నుపై వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది.

ఇంకా, సెక్షన్ 234 ఎఫ్ ప్రకారం, సెక్షన్ 139 (1) ప్రకారం పేర్కొన్న గడువు తేదీ తర్వాత సమర్పించినట్లయితే ఆలస్యంగా దాఖలు చేసే రుసుము రూ. 5,000 చెల్లించాలి. అయితే వ్యక్తి మొత్తం ఆదాయం రూ. 5 లక్షలు మించకపోతే ఆలస్యంగా దాఖలు చేసే ఫీజు మొత్తం రూ .1,000 చెల్లించాలి.

సెక్షన్ 139 ప్రకారం ఐటిఆర్ దాఖలు చేయాల్సిన అవసరం లేనప్పటికీ, గడువు తేదీ తర్వాత స్వచ్ఛందంగా దాఖలు చేయాల్సిన అవసరం లేనట్లయితే సెక్షన్ 234 ఎఫ్ కింద ఆలస్యంగా దాఖలు చేసే రుసుము విధించడం జరగదు.

ఈ ఇబ్బందులు లేకుండా ఆలస్య రుసుము చెల్లించాల్సిన పరిస్థితి రాకుండా మీరు గడువు తేదీలోపు వీలైనంత త్వరగా రిటర్న్స్ ఫైల్ చేసేయండి. ఎందుకంటే, ఆలస్యం అయితే, అందరూ ఒక్కసారిగా రిటర్న్స్ చివరి క్షణంలో ఫైల్ చేసినపుడు తలెత్తే ఇబ్బందుల్లో చిక్కుకోకుండా సజావుగా మీ రిటర్న్స్ దాఖలు చేయగలుగుతారు.

ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఆదాయ రిటర్న్ ఫైల్ చేయడం ఎలానో ఇక్కడ చూద్దాం..!

1. ఆదాయ రిటర్న్ ఇ-ఫైలింగ్ కోసం అధికారిక వెబ్‌సైట్ income tax కి వెళ్లండి.

2. యూజర్ ఐడి (పాన్), పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయడం ద్వారా ఇ-ఫైలింగ్ పోర్టల్‌కి లాగిన్ అవ్వండి. ‘లాగిన్’ క్లిక్ చేయండి.

3. ‘ఇ-ఫైల్’ మెనుపై క్లిక్ చేయండి. ‘ఆదాయపు పన్ను రిటర్న్’ లింక్‌పై క్లిక్ చేయండి.

4. ఆదాయపు పన్ను రిటర్న్ పేజీలో: PAN ఆటో-పాపులేషన్ చేయబడుతుంది. ‘అసెస్‌మెంట్ ఇయర్’ ఎంచుకోండి, ‘ITR ఫారం నంబర్’ ఎంచుకోండి, ‘ఒరిజినల్/రివైజ్డ్ రిటర్న్’ గా ‘ఫైలింగ్ టైప్’ ఎంచుకోండి, ‘ఆన్‌లైన్‌లో ప్రిపేర్ చేయండి. సబ్మిట్ చేయండి’ గా ‘సబ్మిషన్ మోడ్’ ఎంచుకోండి.

5. కొనసాగించుపై క్లిక్ చేయండి.

6. సూచనలను జాగ్రత్తగా చదవండి. ఆన్‌లైన్ ITR ఫారమ్‌లోని అన్ని వర్తించే, తప్పనిసరి ఫీల్డ్‌లను పూరించండి.

7. ‘పన్నులు చెల్లించిన..ధృవీకరణ’ ట్యాబ్‌లో తగిన ధృవీకరణ ఎంపికను ఎంచుకోండి.

8. ‘ప్రివ్యూ మరియు సమర్పించు’ బటన్‌పై క్లిక్ చేయండి, ITR లో నమోదు చేసిన మొత్తం డేటాను ధృవీకరించండి.

9. ITR ని ‘సమర్పించండి’.