కుల్‌భూషణ్ కేసులో తీర్పుపై సుష్మా హర్షం

| Edited By: Pardhasaradhi Peri

Jul 18, 2019 | 7:18 AM

నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కేసులో మరణశిక్షను నిలిపివేస్తూ హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతించారు విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మాస్వరాజ్. ఐసీజే తీర్పుపై ఆమె ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇది భారత్‌కు గొప్ప విజయమని,ఈ తీర్పు జాదవ్ కుటుంబానికి గొప్ప ఓదార్పు అన్నారు సుష్మా. ఈ కేసులో సమర్ధవంతమైన వాదనలు వినిపించిన హరీశ్ సాల్వేకు ప్రత్యేకంగా కృతజఙ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ప్రధాని మోదీకి కూడా ధన్యవాదాలు తెలిపారు. గతంలో విదేశాంగ మంత్రిగా […]

కుల్‌భూషణ్ కేసులో  తీర్పుపై సుష్మా హర్షం
Follow us on

నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కేసులో మరణశిక్షను నిలిపివేస్తూ హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతించారు విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మాస్వరాజ్. ఐసీజే తీర్పుపై ఆమె ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇది భారత్‌కు గొప్ప విజయమని,ఈ తీర్పు జాదవ్ కుటుంబానికి గొప్ప ఓదార్పు అన్నారు సుష్మా. ఈ కేసులో సమర్ధవంతమైన వాదనలు వినిపించిన హరీశ్ సాల్వేకు ప్రత్యేకంగా కృతజఙ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ప్రధాని మోదీకి కూడా ధన్యవాదాలు తెలిపారు. గతంలో విదేశాంగ మంత్రిగా ఉన్నపుడు జాదవ్ కుటుంబ సభ్యులు ఇస్లామాబాద్‌ జైలుకు వెళ్లి పరామర్శించడంలో సుష్మా ప్రత్యేక పాత్ర పోషించారు.