ముంబయి:ఇప్పటికే వీడియోకాన్ గ్రూప్‌కు పేవర్ చేశారన్న ఎలిగేషన్స్‌కి సంభందించి క్విడ్ ప్రోకో కేసును ఎదుర్కుంటున్న ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందాకొచ్చర్‌కు కొత్త సమస్యలు చుట్టుకుంటున్నాయి. ఆమె భర్త దీపక్ కొచ్చర్ పై త్వరలోనే ఆదాయపన్ను అధికారులు బినామీ వ్యవహారాల వ్యతిరేక చట్టం కింద దర్యాప్తు ప్రారంభించనున్నారు. గతంలో పన్ను ఎగవేతకు సంబంధించి చేసిన దర్యాప్తులో పెద్దగా పురోగతి లేకపోవడంతో బినామీ వ్యతిరేక చట్టం కింద దర్యాప్తు చేపట్టాలని భావిస్తున్నారు.
గత ఏడాది విచారణ సందర్భంగా దీపక్‌కొచ్చర్‌ను సింగపూర్‌కు చెందిన కంపెనీ ఏడీఎస్‌ఎఫ్ తన సబ్సిడరీ డీహెచ్ రెనీవబుల్ హోల్డింగ్స్ ద్వారా పెట్టిన రూ.405 కోట్ల పెట్టుబడులపై వివరాలు ఇచ్చారు. ఈ విచారణ సందర్భంగా అధికారులు కొన్ని లోపాలను గుర్తించారు. మనీలాండరింగ్, నగదును వేర్వేరు మార్గాల్లో కంపెనీలోకి తీసుకొచ్చినట్లు అనుమానాలు ఉన్నాయని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ నివేదికను ఈడీతో పంచుకొన్నారు.