అభినందన్‌ పేరుతో కుప్పలు తెప్పలుగా ఫేక్ అకౌంట్లు

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:27 PM

వార్తల్లో ఎవ్వరు ఫేమస్ అయినా వెంటనే వారి పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు దర్శనమిస్తున్నాయి. దీంతో ఆ ఖాతాలను ఫాలో అయ్యేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే, తాజాగా, పాకిస్థాన్‌ ఆర్మీకి చిక్కి… సురక్షితంగా తిరిగి భారత్‌ గడ్డపై అడుగుపెట్టిన భార‌త వాయుసేన పైల‌ట్‌, వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ వ‌ర్థమాన్‌పై సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లను కొందరు కుప్పలు తెప్పలుగా సృష్టించారు. దీంతో అభినందన్‌పై ఉన్న అభిమానంతో ఆ ఖాతాలను ఫాలో అయ్యేవారి సంఖ్య కూడా […]

అభినందన్‌ పేరుతో కుప్పలు తెప్పలుగా ఫేక్ అకౌంట్లు
Follow us on

వార్తల్లో ఎవ్వరు ఫేమస్ అయినా వెంటనే వారి పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు దర్శనమిస్తున్నాయి. దీంతో ఆ ఖాతాలను ఫాలో అయ్యేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే, తాజాగా, పాకిస్థాన్‌ ఆర్మీకి చిక్కి… సురక్షితంగా తిరిగి భారత్‌ గడ్డపై అడుగుపెట్టిన భార‌త వాయుసేన పైల‌ట్‌, వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ వ‌ర్థమాన్‌పై సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లను కొందరు కుప్పలు తెప్పలుగా సృష్టించారు. దీంతో అభినందన్‌పై ఉన్న అభిమానంతో ఆ ఖాతాలను ఫాలో అయ్యేవారి సంఖ్య కూడా భారీగా పెరిగిపోయింది. దీంతో రంగంలోకి దిగిన భారత వాయుసేన యూజర్లందరికీ షాకిచ్చింది. అభినందన్ వర్థమాన్ గురించి ఓ క్లారిటీ ఇచ్చింది. భారత వాయుసేన వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ వ‌ర్థమాన్‌కు ఎటువంటి సోష‌ల్ మీడియా అకౌంట్ లేద‌ని భారత వాయుసేన ప్రక‌టించింది.

సోష‌ల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న పుకార్లను అడ్డుకోవాల‌న్న ఉద్దేశంతో ఐఏఎఫ్… అభినందన్‌కు ఎలాంటి సోషల్ మీడియా ఖాతా లేదని క్లారిటీ ఇస్తూ… ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో అభినందన్‌కు అకౌంట్లు లేవంటూ ట్వీట్ చేసింది. దాంతో పాటు అభి పేరుతో సోషల్ మీడియాలో ఉన్న ఫేక్ అకౌంట్లను ఫాలో కావొద్దని సోషల్ మీడియా యూజర్లను ఐఏఎఫ్ కోరింది.