హైదరాబాద్ నాచారంలోని మల్లాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త తనని భవనం పై నుంచి తోసేశాడు. అదే సమయంలో బాధితురాలితో పాటు చిన్నారి కూడా భవనం పై నుంచి పడిపోయింది. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మహిళకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు మహిళను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.