వరల్డ్ వార్- II.. ప్రపంచంలో జరిగిన అత్యంత పెద్ద యుద్ధం అని చెప్పాలి. ఇందులో వేలాది మంది సైనికులు చనిపోయారు. ఎన్నో దేశాలు మట్టి కరిచిపోయాయి.. అలాంటి దేశాల్లో ఒకటి బ్రిటన్ (ఇంగ్లాండ్). 1945 వ సంవత్సరం లో బాంబ్ దాడిలో సర్వ నాశనం అయింది బ్రిటన్. ఎక్కడ చూసినా శిధిలాలు, బూడిద తప్ప ఏమి లేవు.. అలాంటి బ్రిటన్ దేశం మెల్లిగా తన పునర్వైభవాన్ని సంచరించుకుంది.
ఇది ఇలా ఉంటే యూనివర్సిటీ అఫ్ కేంబ్రిడ్జి ప్రొఫసర్స్ వరల్డ్ వార్ 2 టైంలో బ్రిటన్ కు సంబంధించిన కొన్ని చిత్రాలను తాజాగా రిలీజ్ చేశారు. ఇక ఈ చిత్రాలను అప్పటి యుద్ధ సమయంలో రేఫ్ పైలట్స్ తీశారని కేంబ్రిడ్జి ఆర్కియోలాజిస్ట్ జెకె జోసెఫ్ తెలిపారు. అవి బాంబు దాడి నుంచి అత్యాధునికంగా బ్రిటన్ దేశం ఎలా ఆవిర్భవించిందో తెలియజేస్తాయట.
ఈ చిత్రాలను కేంబ్రిడ్జి ప్రొఫెసర్స్ 2009 లో వారు తీసిన ఫొటోస్ తో వీటిని జత చేశారు. మొదటి 1,500 ఫొటోస్ ను గూగుల్ ఎర్త్ లో ‘హిస్టారికల్ గూగుల్ ఎర్త్’ అనే పేరుతో భద్రపరిచారు. పదండి మనం కూడా ఒకసారి వెనక్కి వెళ్లి ఈ కట్టడాలను చూద్దాం.
1. లివర్ పూల్స్ వాటర్ సైడ్:
2. ఇస్లే అఫ్ ది డాగ్స్ ఇన్ సెంట్రల్ లండన్
3. థేమ్స్ రివర్ మీద కట్టడాలు
4. లండన్ లోని రివర్ థేమ్స్
ఇలా మరెన్నో చిత్రాల్లో 1945 కాలం నుంచి వేగంగా అభివృద్ధి చెందిన బ్రిటన్ ను చూస్తారు..