తెలంగాణ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం

| Edited By:

Mar 03, 2019 | 7:47 PM

ఐటీ గ్రిడ్‌ కంపెనీ ఉద్యోగుల అదృశ్యంపై సహోద్యోగి అశోక్‌ పిటిషన్‌ వేశారు. కంపెనీ ఉద్యోగులు రేగొండ భాస్కర్‌, ఫణి కడలూరి, చంద్రశేఖర్‌, విక్రమ్‌గౌడ్‌ కనిపించడం లేదని హైకోర్టులో హెబియస్‌కార్పస్‌ పిటిషన్‌ దాఖలైంది. తెలంగాణ హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, డీజీపీతో పాటు సైబర్‌క్రైం వింగ్‌, స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌, మాదాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌‌ని ప్రతివాదులుగా పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు సోమవారం ఉదయం 10:30 గంటలకు నలుగురిని ప్రవేశపెట్టాలని కోర్టు ఆదేశించింది. అయితే ఆ నలుగురికి తాము […]

తెలంగాణ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
Follow us on

ఐటీ గ్రిడ్‌ కంపెనీ ఉద్యోగుల అదృశ్యంపై సహోద్యోగి అశోక్‌ పిటిషన్‌ వేశారు. కంపెనీ ఉద్యోగులు రేగొండ భాస్కర్‌, ఫణి కడలూరి, చంద్రశేఖర్‌, విక్రమ్‌గౌడ్‌ కనిపించడం లేదని హైకోర్టులో హెబియస్‌కార్పస్‌ పిటిషన్‌ దాఖలైంది. తెలంగాణ హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, డీజీపీతో పాటు సైబర్‌క్రైం వింగ్‌, స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌, మాదాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌‌ని ప్రతివాదులుగా పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు సోమవారం ఉదయం 10:30 గంటలకు నలుగురిని ప్రవేశపెట్టాలని కోర్టు ఆదేశించింది. అయితే ఆ నలుగురికి తాము 160 నోటీసు ఇచ్చామని తెలంగాణ పోలీసులు తెలిపారు. కేసు డైరీలో ఖాళీ పేపర్లు ఉండడంతో తెలంగాణ పోలీసులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ కుటుంబ సభ్యులైనా తమ ప్రాణాలను రిస్క్‌లో పెట్టుకుని పోలీసులపై ఫిర్యాదు చేయరని హైకోర్టు మండిపడింది. అఫిడవిట్‌తో రావాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది.