బ్రేకింగ్: రేపు ఉదయం 10.30 గం.లకు చర్చలు జరపండి: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
రేపు ఉదయం 10 గంటలకు ఆర్టీసీ కార్పొరేషన్.. కార్మికులతో ప్రభుత్వం చర్చలకు జరపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం వాడివేడిగా సాగిన వాదనల తర్వాత ఇరుపక్షాల వైఖరిని న్యాయస్ధానం తప్పుబట్టింది. కార్మికుల డిమాండ్లలో 50 శాతం న్యాయమైనవే ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. అదే సమయంలో ప్రజలను ఇబ్బందుల పాలుజేస్తున్న సమ్మెను విరమించాలని ఆర్టీసీ సంఘాలకు సూచించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెను రాజకీయం చేయాలని యూనియన్లు భావిస్తున్నాయని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. రేపు రాష్ట్ర వ్యాప్త బంద్‌కు […]
రేపు ఉదయం 10 గంటలకు ఆర్టీసీ కార్పొరేషన్.. కార్మికులతో ప్రభుత్వం చర్చలకు జరపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం వాడివేడిగా సాగిన వాదనల తర్వాత ఇరుపక్షాల వైఖరిని న్యాయస్ధానం తప్పుబట్టింది. కార్మికుల డిమాండ్లలో 50 శాతం న్యాయమైనవే ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. అదే సమయంలో ప్రజలను ఇబ్బందుల పాలుజేస్తున్న సమ్మెను విరమించాలని ఆర్టీసీ సంఘాలకు సూచించింది.
ఆర్టీసీ కార్మికుల సమ్మెను రాజకీయం చేయాలని యూనియన్లు భావిస్తున్నాయని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. రేపు రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునివ్వడంపై ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధం గా ఉందని ప్రభుత్వం తెలిపింది. ఇదిలా ఉంటే రేపు జరగనున్న బంద్‌కు టీఎన్జీవో సంఘాలు, ప్రైవేట్ క్యాబ్స్ కూడా మద్దతు పలికాయని ఆర్టీసీ యూనియన్లు కోర్టుకు వివరించాయి. దీనిపై సీరియస్ అయిన కోర్టు ప్రభుత్వ చర్యలపై విస్మయం వ్యక్తం చేస్తూ.. ఆర్టీసి సమ్మెకు ప్రజల మద్దతు పెరిగితే ఆందోళలను ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించింది. ప్రజలు చాల శక్తిమంతులని, ఒకవేళ వారు తిరగబడితే ఆపే పరిస్థితి ఉండదంటూ వ్యాఖ్యానించింది. గత రెండు వారాలుగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంటే ఎందుకు ఆపలేకపోయారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇప్పటి వరకు ఆర్టీసీకి పూర్తి స్ధాయిలో ఎండీని ఎందుకు నియమించలేదని ప్రశ్నిస్తూ.. ఒకవేళ అలా నియమిస్తే ఒక అడుగు మందుకు వేసినట్టే కదా అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది..
ఆర్టీసీ కార్మికులకు ఆరోగ్యశ్రీ కల్పించడానికి ప్రభుత్వానికి ఇబ్బంది ఏమిటని కోర్టు ప్రశ్నిస్తూ.. వారికి ఆరోగ్య భద్రత కల్పించాలని పేర్కొంది. అదే విధంగా తార్నాక ఆర్టీసీ హాస్పిటల్‌ను సైతం అభివృద్ధి చేయాలన్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల డిమాండ్ చేస్తున్న వాటిలో 50 శాతం న్యాయబద్దంగానే ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఇదిలా ఉంటే ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల విషయంలో ఐఏఎస్ అధికారులతో కమిటీ వేశామని ఇంతలోనే సమ్మెకు దిగారని ప్రభుత్వం తరపున వాదిస్తున్న అడ్వొకేట్ జనరల్ హైకోర్టకు వివరించారు. కోర్ట్ చెప్పినా వినే పరిస్థితిలో మీరు లేరంటూ హైకోర్ట్ వ్యాఖ్యానించింది. ఆర్టీసి సమస్యకు ప్రభుత్వం , ఆర్టీసీ సంఘాలు ఇద్దరూ కారణమేనంటూ అభిప్రాయపడుతూ కార్మికుల డిమాండ్ పెద్దది కదా అని సైలెంట్ గా ఉంటే ఎలా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సమ్మె తదనంతర పరిణామాలపై ఇరు పక్షాల వాదలనలను విన్న హైకోర్టు ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టింది. ” ఇప్పుడు అదేశాలు ఇస్తాం.. మీకు అభ్యంతరం ఉంటే మళ్ళీ సవాలు చేసుకోండి” అని ప్రభుత్వ న్యాయవాది పై అసహనం వ్యక్తం చేస్తూ తదుపరి వాదనలను వినిపించకుండా న్యాయమూర్తి ఆపేశారు. మొత్తానికి గత రెండు వారాలుగా సాగుతున్న ఆర్టీసీ సమ్మెకు తెరపడేలా.. మూడు రోజుల్లో చర్చల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆర్టీసీ సమ్మెపై విచారణను ఈనెల 28 కి వాయిదా వేసింది న్యాయస్థానం. ఆరోజున చర్చల సారాంశంతో ముందుకు రావాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజలు ఇబ్బందులు పడకూడదంటూ ఆయన వ్యాఖ్యానించారు.