రెండు రాష్ట్రాల్లో మళ్ళీ భారీ వర్షాలు

|

Nov 04, 2020 | 6:24 PM

వచ్చే అయిదు రోజులు రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది భారత వాతావరణ శాఖ (ఐఎండీ). నవంబర్ 4వ తేదీ నుంచి 8వ తేదీ దాకా రెండు రాష్ట్రాల్లో...

రెండు రాష్ట్రాల్లో మళ్ళీ భారీ వర్షాలు
Follow us on

Heavy rains again in two states: వచ్చే అయిదు రోజులు రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది భారత వాతావరణ శాఖ (ఐఎండీ). నవంబర్ 4వ తేదీ నుంచి 8వ తేదీ దాకా రెండు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం మెండుగా వుందని ఐఎండీ బుధవారం నాడు బులెటిన్ రిలీజ్ చేసింది.

బంగాళాఖాతంపై నైరుతి దిశగా సైక్లోనిక్ సర్క్యులేషన్ ఫామ్ అయినందున రెండు రాష్ట్రాలు అంటే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఆస్కారముందని ఐఎండీ శాస్త్రవేత్తలు అంఛనా వేస్తున్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాలైన పుదుచ్ఛేరి, లక్ష్యద్వీప్, కర్నాటక రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ బులెటిన్‌లో పేర్కొన్నారు.

బంగాళాఖాతంపై ఏర్పడిన సైక్లోనిక్ సర్క్యులేషన్ ప్రభావం ఆగ్నేయ అరేబియా సముద్ర ఉపరితలంపై కూడా వుంటుందని, దాని ప్రభావంతో దక్షిణ కర్నాటక, కేరళ, లక్ష్వద్వీప్ ప్రాంతాలలో అయిదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అంఛనా వేస్తున్నారు. అదే సమయంలో మధ్య, ఉత్తర, పశ్చిమ భారత దేశ రాష్ట్రాలలో వాతావరణం వచ్చే అయిదు రోజుల పాటు అంటే నవంబర్ 8వ తేదీ దాకా పొడిగా వుంటుందని ఐఎండీ శాస్త్రవేత్తలు తెలిపారు.

ALSO READ: ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్.. కేసుల్లో మరింత తీవ్రత

ALSO READ: సిట్టింగ్ లీడర్ల కేసులపై వున్న కేసులకే తొలి ప్రాధాన్యం

ALSO READ: వరాహస్వామి ఆలయానికి బంగారు తాపడం

ALSO READ: సాగర తీరానికి కొత్త సొబగులు..ఇక రాత్రంతా..!

ALSO READ: విజయవంతంగా ‘పినాక’ ప్రయోగం

ALSO READ: స్కూళ్ళ రీఓపెనింగ్‌పై తమిళ సర్కార్ వెనుకంజ