శివరాత్రి ఉపవాసం తర్వాత నీరసమా.. మీ కోసం బెస్ట్ ఎనర్జీ డ్రింక్స్ ఇవే!

Samatha

16 February 2026

మహా శివరాత్రి పర్వదినం పూర్తి అయ్యింది. ఫిబ్రవరి 17న శివ భక్తులందరూ జాగరణ, ఉపవాసాలతో పరమేశ్వరుడికి ప్రత్యేకంగా పూజలు చేశారు. అయితే ఈ రోజు చాలా మంది ఉపవాసం దీక్ష చేపడతారు.

శివరాత్రి ఉపవాసం

అయితే శివరాత్రి జాగరణ తర్వాత నీరసంగా, అలసటగా  అనిపిస్తుందా. అయితే మీరు మీకు శక్తినిచ్చే ఈ ఎనర్జీ డ్రింక్స్ తాగాల్సిందే. అవి ఏవో చూసెయ్యండి.

ఎనర్జీ డ్రింక్స్

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ఉపవాసం తర్వాత వీటిని తాగడం వలన ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందించి, బలహీనత, అలసటను తగ్గిస్తాయి.

కొబ్బరి నీళ్లు

నిమ్మకాయ నీళ్లు తాగడం వలన డీ హైడ్రేషన్ తగ్గుతుంది. శరీరం హైడ్రేట్‌గా ఉండటమే కాకుండా, ఇవి మిమ్మల్ని చురుకుగా ఉండేలా చేస్తాయి.

నిమ్మకాయ నీళ్లు

మజ్జిగలో ప్రోబయటిక్స్ ఉండటం వలన ఇవి కడుపును చల్లబరిచి, జీర్ణక్రియనుమెరుగుపరుస్తాయి. ముఖ్యంగా ఉపవాసం తర్వాత దీనిని తీసుకోవడం వలన బలహీనత తగ్గుతుంది.

మజ్జిగ

సోంపు నీళ్లు : సోంపు నీళ్లు జీర్ణక్రియకు తోడ్పడుతుంది. వీటిని ఉపవాసం తర్వాత తీసుకోవడం వలన మీ శరీరం తేలికగా, ఆరోగ్యంగా ఉంటుంది.

సోంపు నీళ్లు

వెలగపండు జ్యూస్ : శరీరానికి చల్లదనం ఇచ్చే పండ్లలో ఇదొక్కటి. దీని జ్యూస్ తాగం వలన ఉపవాసం తర్వాత వచ్చే బలహీనత, నీరసం నుంచి కాపాడుతుంది.

వెలగపండు జ్యూస్

ఆరెంజ్ జ్యూస్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఉపవాసం తర్వాత తక్షణ శక్తి కోసం దీనిని తీసుకోవడం వలన నీరసం నుంచి బయటపడవచ్చును.

ఆరెంజ్ జ్యూస్