ఇబ్రహీంపట్నం: ప్రేమ వేధింపులు తాళలేక ఓ ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన రుక్మిణి హైదరాబాద్ లో బీ- ఫార్మసీ చదువుతోంది. ఇక అదే గ్రామానికి చెందిన పవన్ అనే వ్యక్తి ఆమెను గత ఆరు నెలలుగా ప్రేమిస్తున్నానంటూ వేధింపులకు గురి చేస్తున్నాడు. ఇక ఆ అమ్మాయి ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. పవన్‌ను ఆమె తల్లిదండ్రులు పలుమార్లు మందలించినా కూడా ఏమి ప్రయోజనం లేకపోగా.. వేధింపులు ఇంకా పెరిగాయి. దీంతో ఆ అమ్మాయి శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పవన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.