మేడ్చల్ : జిల్లాలోని దూలపల్లి – జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం సంభవించింది. పారిశ్రామికవాడలోని ఓ రసాయన గోదాములో మంటలు చెలరేగాయి. రసాయనాలను ట్యాంకుల నుంచి మారుస్తుండగా మంటలు వ్యాపించాయి. గోదాములో నుంచి మంటలు ఎగసిపడుతూ బయట ఉన్న రసాయన ట్యాంకులకు అంటుకున్నాయి. దీంతో బయట ఉన్న రసాయన ట్యాంకులు పేలాయి. పేలుడు దాటికి సమీప ప్రాంతాలన్నీ దట్టమైన పొగలను అలుముకున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు.