సిద్ధిపేట జిల్లా గౌరారంలోని ఓ ఇంట్లో ఫ్రిడ్జ్ పేలుడు కలకలం రేపింది. ఒక్కసారిగా ఫ్రిడ్జ్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఇంట్లోని వారంతా బయటకు పరుగులు తీశారు. ఇంట్లో నుంచి భారీగా పొగలు రావడంతో గ్రామస్థులంతా ఏం జరిగిందోనని కంగారుపడ్డారు. ఎవరికీ ప్రాణాపాయం జరగపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.