ఆ ఏడాది పుష్కలంగా వర్షాలు.. గుడ్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ

|

Apr 15, 2020 | 1:56 PM

దేశవ్యాప్తంగా ఈసారి వర్షాకాలంలో పుష్కలంగా వర్షాలు పడతాయని అంఛనా వేస్తోంది భారత వాతావరణ శాఖ. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో సాధారణంగా ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందని వాతావరణ శాఖాధికారులు బుధవారం వెదర్ ఫోర్ కాస్ట్ సెషన్‌లో వెల్లడించారు. వచ్చే వర్షాకాలం ఎలా వుండబోతోందనే అంశంపై...

ఆ ఏడాది పుష్కలంగా వర్షాలు.. గుడ్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ
Follow us on

దేశవ్యాప్తంగా ఈసారి వర్షాకాలంలో పుష్కలంగా వర్షాలు పడతాయని అంఛనా వేస్తోంది భారత వాతావరణ శాఖ. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో సాధారణంగా ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందని వాతావరణ శాఖాధికారులు బుధవారం వెదర్ ఫోర్ కాస్ట్ సెషన్‌లో వెల్లడించారు. వచ్చే వర్షాకాలం ఎలా వుండబోతోందనే అంశంపై అంఛనాలను ఖరారు చేసిన భారత వాతావరణ శాఖ బుధవారం వాటి వివరాలను మీడియాకు వెల్లడించింది. రుతుపవనాలు ఆలస్యంగా ఎంటరై.. ఆలస్యంగా నిష్క్రమిస్తాయని వాతావరణ శాఖ అంఛనా వేస్తోంది.

డైనమిక్ మోడల్ ప్రకారం సాధారణం కంటే కాస్త ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందని వాతావరణ శాఖ అంటోంది. లా-నినా పరిస్థితుల వల్ల అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం వుందని అధికారులు చెబుతున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల వారీగా చూసుకుంటే.. ఉత్తరాది రాష్ట్రాలలో ఈ ఏడాది వర్షాలు సాధారణంగా ఉంటాయని తెలిపారు వాతావరణ శాఖాధికారులు. కరోనా కష్టకాలంలో రైతాంగానికి ఇది శుభవార్త చెబుతున్నామంటున్న అధికారులు.. దేశవ్యాప్తంగా వర్షపాతం సగటున 96%-104% మధ్య ఉంటుందని తెలిపారు.

జూన్ 1వ తేదీన కేరళను నైరుతీ రుతుపవనాలు తాకుతాయని, మహారాష్ట్ర, గుజరాత్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, బిహార్, యూపీలోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు రాక 3 నుంచి 7 రోజులు ఆలస్యమయ్యే అవకాశం వుందని వాతావరణ శాఖ అంఛనా వేస్తోంది. అదే సమయంలో రుతుపవనాల తిరోగమనం 7-14 రోజులు ఆలస్యమయ్యే అవకాశం వుందంటున్నారు అధికారులు. తిరోగమనం ఆలస్యమవడం ఆశావహమని చెబుతున్నారు.

దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ, కర్నాటక, తెలంగాణ, దక్షిణ మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ఏపీలోని కోస్టల్ తీరంలో వర్షాలు పుష్కలంగా పడతాయని వాతావరణ శాఖాధికారులు వివరించారు. మిగిలిన రాష్ట్రాలలో వర్షపాతం సాధారణంగా నమోదవుతుందని వారు అంఛనా వేస్తున్నారు. ఉత్తరాది ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమవుతాయని, మొత్తానికి సాధారణ స్థాయిలోనే వర్షాలు నమోదు అవుతాయని వివరించారు అధికారులు.