వొక్స్‌వ్యాగన్‌కు గ్రీన్ ట్రిబ్యునల్ రూ. 500కోట్ల జరిమానా

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:42 PM

దిల్లీ: ఉద్గారాలు వెలువరుస్తూ పర్యావరణానికి హానీ కలిగించినందుకు గానూ  జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ ఉత్ఫత్తుల సంస్థ ఫోక్స్‌వ్యాగన్‌కు జాతీయ హరిత ట్రైబ్యూనల్‌ రూ. 500కోట్ల జరిమానా విధించింద. రెండు నెలల్లోగా ఈ మొత్తాన్ని జమచేయాలని ఎన్జీటీ ఛైర్‌పర్సన్‌ జస్టిస్‌ ఆదర్శ్‌ కుమార్‌ గోయల్‌ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఫోక్స్‌వ్యాగన్‌ డీజిల్‌ కార్లలో ఉపయోగించే ఓ పరికరం కారణంగా పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతోందని సంస్థపై ఉద్గారాల కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన ట్రైబ్యూనల్‌ నష్ట […]

వొక్స్‌వ్యాగన్‌కు గ్రీన్ ట్రిబ్యునల్ రూ. 500కోట్ల జరిమానా
Follow us on

దిల్లీ: ఉద్గారాలు వెలువరుస్తూ పర్యావరణానికి హానీ కలిగించినందుకు గానూ  జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ ఉత్ఫత్తుల సంస్థ ఫోక్స్‌వ్యాగన్‌కు జాతీయ హరిత ట్రైబ్యూనల్‌ రూ. 500కోట్ల జరిమానా విధించింద. రెండు నెలల్లోగా ఈ మొత్తాన్ని జమచేయాలని ఎన్జీటీ ఛైర్‌పర్సన్‌ జస్టిస్‌ ఆదర్శ్‌ కుమార్‌ గోయల్‌ గురువారం ఆదేశాలు జారీ చేశారు.

ఫోక్స్‌వ్యాగన్‌ డీజిల్‌ కార్లలో ఉపయోగించే ఓ పరికరం కారణంగా పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతోందని సంస్థపై ఉద్గారాల కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన ట్రైబ్యూనల్‌ నష్ట నివారణ చర్యల కింద కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి రూ.100కోట్లు జమ చేయాలని ఆదేశించింది.

కేసు దర్యాప్తు నిమిత్తం కాలుష్య నియంత్రణ మండలి, భారీ పరిశ్రమల శాఖ, నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ రీసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌, ఆటోమేటివ్‌ రీసర్చ్‌ అసోసియేషన్ ఆఫ్‌ ఇండియా ప్రతినిధులతో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. వీరి నుంచి సిఫార్సులు తీసుకున్న అనంతరం.. పర్యావరణాన్ని కలుషితం చేసినందుకుగానూ ఫోక్స్‌వ్యాగన్‌కు రూ. 500కోట్ల జరిమానా విధిస్తూ నేడు తీర్పు వెల్లడించింది.