వైసీపీలో చేరిన సహజనటి

హైదరాబాద్: ప్రముఖ సినీ నటి జయసుధ వైసీపీలో జాయిన్ అయ్యారు. గురువారం సాయంత్రం లోటస్ పాండ్‌లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ను కలసిన ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ పార్టీ కండువా కప్పి జయసుధను సాదరంగా పార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా వచ్చే ఎలక్షన్స్‌లో జగన్ సిఎం కావడం కాయమని జయసుధ జోస్యం చెప్పారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో జయసుధ 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుండి  కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి  విజయం […]

వైసీపీలో చేరిన సహజనటి
Ram Naramaneni

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:53 PM

హైదరాబాద్: ప్రముఖ సినీ నటి జయసుధ వైసీపీలో జాయిన్ అయ్యారు. గురువారం సాయంత్రం లోటస్ పాండ్‌లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ను కలసిన ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ పార్టీ కండువా కప్పి జయసుధను సాదరంగా పార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా వచ్చే ఎలక్షన్స్‌లో జగన్ సిఎం కావడం కాయమని జయసుధ జోస్యం చెప్పారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో జయసుధ 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుండి  కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి  విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో జయసుధకు టిక్కెట్టు దక్కడంలో  అప్పటి సీఎం వైఎస్ఆర్ కీలకపాత్ర పోషించారు. కానీ 2014 ఎన్నికల్లో మాత్రం ఆవిడకు ఓటమి తప్పలేదు.

ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఏడాది క్రితం జయసుధ టీడీపీలో చేరారు. ఆ తర్వాత సినిమాలతో బిజీగా ఉంటూ టీడీపీ కార్యక్రమాల్లో ఆమె ఎప్పుడూ క్రియాశీలకంగా పాల్గొనలేదు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu