ఈ ఉదయం టీడీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీలో చేరారు. ఈ మేరకు తాజాగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసిన ఆయన.. వైసీపీ కండువాను కప్పుకున్నారు. అయనతో పాటు విశాఖపట్టణానికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఏ రెహమాన్ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం డొక్కా మాట్లాడుతూ.. 2014లోనే తాను వైసీపీలో చేరాల్సి ఉందని ఆయన అన్నారు. జగన్ నాయకత్వంలో పనిచేయాలని ఆశించి పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని.. టీడీపీలో తనకు కలిసిరాలేదని డొక్కా పేర్కొన్నారు.
మరోవైపు తమ పార్టీలోకి డొక్కా చేరికపై మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. జగన్ సంక్షేమ పథకాలు చూసి డొక్కా పార్టీలో చేరబోతున్నారని.. బడుగు బలహీనర్గాలకు చెందిన నేత వైసీపీకి అండగా ఉండటం సంతోషమని ఆయన అన్నారు. టీడీపీ వైఖరి నచ్చకనే అనేక మంది పార్టీ వీడుతున్నారని పేర్కొన్నారు.
డొక్కా వైసీపీలో చేరడంపై ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. టీడీపీకి రాజీనామా చేసి డొక్కా వైసీపీలో చేరడం శుభపరిణామని ఆయన అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లోనూ పనిచేసిన డొక్కా.. ఇప్పుడు జగన్ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధమయ్యారని ఈ సందర్భంగా అంబటి తెలిపారు. ఎన్నికలకు ముందే వైసీపీలో చేరాలని భావించిన అనివార్యమైన కారణాల వలన వీలు కాలేదని.. స్థానిక సంస్థల ఎన్నికల ముందు డొక్కా పార్టీలో చేరడం బలాన్ని ఇస్తుందని అంబటి తెలిపారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ ఎమ్మెల్సీ డొక్క మాణిక్య వరప్రసాద్, విశాఖ టీడీపీ మాజీ ఎమ్మెల్యే రెహమాన్, తదితరులు. #YSRCP #APCMYSJagan #Dokka #Rahman pic.twitter.com/wRq81oqOTF
— YSR Congress Party (@YSRCParty) March 9, 2020
Read This Story Also: ప్రభుత్వ చీఫ్ విప్‌తో రాహుల్, ప్రకాష్ రాజ్ భేటీ.. రాజీ కోసమేనా..!