హైదరాబాద్: తమ ఆఫీస్‌కు, సెన్సార్ బోర్డుకు మధ్య ఉన్న అపార్ధాలు తొలగిపోయాయని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. తమ మధ్య వచ్చిన విభేదాలు ఇప్పుడు తొలగిపోయాయని, నిబంధనల ప్రకారం చేయాల్సిన చర్యలు తీసుకునేందుకు సెన్సార్ బోర్డ్ సిద్ధమైందని వర్మ తెలిపారు. అందుకే తాము సెన్సార్ బోర్డ్‌కు వ్యతిరేకంగా ఏర్పాటు చేయాలనుకున్న ప్రెస్ మీట్‌ను రద్దు చేసుకున్నామని తెలిపారు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీని ఎన్నికల తర్వాత విడుదల చేసుకోవాలని సెన్సార్ బోర్డ్ చెప్పినట్టు తొలుత వర్మ చెప్పారు. దీంతో తన హక్కులకు భంగం వాటిల్లుతుందంటూ చెప్పిన వర్మ కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమౌతున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ విడుదలకు ఇబ్బందులు తొలగినట్టే కనిపిస్తున్నాయి.
There has been an unfortunate misunderstanding between our office and the CBFC which has now been cleared ..The CBFC is now doing the necessary action as per the laid down procedure ..Hence our press meet against the CBFC is cancelled ..Jai NTR??? #LakshmiNTR
— Ram Gopal Varma (@RGVzoomin) March 17, 2019