ఈ దెబ్బకు జగన్ ఉద్యోగం ఊడినా ఆశ్చర్యపోనవసరం లేదు

| Edited By: Pardhasaradhi Peri

Apr 12, 2020 | 8:40 PM

ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జీవోలు తెచ్చారని విమర్శించారు. ఈ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వానికి కోర్టులో మొట్టికాయలు తప్పవని, ఈ దెబ్బకు జగన్ ఉద్యోగం ఊడినా ఆశ్చర్యపోనవసరం లేదని వ్యాఖ్యానించారు. తప్పుడు జీవోలకు గవర్నర్ కార్యాలయం..

ఈ దెబ్బకు జగన్ ఉద్యోగం ఊడినా ఆశ్చర్యపోనవసరం లేదు
Follow us on

ఏపీ సీఎం జగన్‌పై.. టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఇష్టానుసారం తప్పించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భగా దేవినేని ఉమ మాట్లాడుతూ.. ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జీవోలు తెచ్చారని విమర్శించారు. ఈ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వానికి కోర్టులో మొట్టికాయలు తప్పవని, ఈ దెబ్బకు జగన్ ఉద్యోగం ఊడినా ఆశ్చర్యపోనవసరం లేదని వ్యాఖ్యానించారు. తప్పుడు జీవోలకు గవర్నర్ కార్యాలయం అధికారులు వంతపాడారని విమర్శించారు.

కాగా మరోవైపు ఎగుమతులు లేక మామిడి రైతులు అవస్థలు పడుతున్నారని, మీడియా ముందుకు వచ్చి నిజాలు చెప్పే ధైర్యం సీఎంకు లేదని ఆరోపణలు చేశారు. లాక్‌డౌన్ ఎత్తివేస్తామన్న సీఎం జగన్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంతో కూడుకున్నవన్నారు. ప్రజలను ప్రమాదకర స్థితిలో పడేస్తున్నారని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ నేపథ్యంలో.. బాధ్యతగల నేతగా చంద్రబాబు రాష్ట్రానికి అనేక సూచనలు చేస్తుంటే.. వైసీపీ నేతలు తప్పు పట్టడం దారుణమని మండి పడ్డారు. తెలంగాణ నుంచి వచ్చిన ఏపీ విద్యార్థులను క్వారంటైన్‌లో పెట్టారు కానీ.. చెన్నై నుంచి వచ్చిన కనగరాజ్‌ను మాత్రం ఎందుకు క్వారంటైన్‌లో పెట్టలేదని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి:

ఐసోలేషన్, క్వారంటైన్‌కు మధ్య తేడాలేంటంటే?

హ్యాకర్ల నుంచి మీ ఫోన్‌ను రక్షించుకోండిలా..!

కరోనా బాధితుల్లో స్మోకింగ్ చేసేవారే ఎక్కువ

క్వారంటైన్‌ కేంద్రంలో గర్భిణి ప్రసవం

ఇకపై రోడ్డు మీదకొస్తే.. ఇలా పట్టుకుంటారు

ఫ్లాష్‌న్యూస్: ఏప్రిల్ 30 వరకూ రాష్ట్రంలో లాక్‌డౌన్‌

జబర్దస్త్ నుంచి వాళ్లిద్దరినీ తప్పించనున్న మల్లెమాల టీం?