Delhi riots : హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి రూ.కోటి ఆర్ధికసాయం..

|

Feb 26, 2020 | 5:58 PM

ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వం (సవరణ) చట్టం (సిఎఎ) పై ఘర్షణల సమయంలో మరణించిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్‌కు నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అమరవీరుడు హోదాను ఇచ్చింది. ఇవే కాకుండా కుటుంబ సభ్యులకు రూ .1 కోటి, అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిపింది.

Delhi riots : హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి రూ.కోటి ఆర్ధికసాయం..
Follow us on

Delhi riots :  ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ (సవరణ) చట్టం (సిఎఎ) పై ఘర్షణల సమయంలో మరణించిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్‌కు నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అమరవీరుడు హోదాను ఇచ్చింది. ఇవే కాకుండా కుటుంబ సభ్యులకు రూ .1 కోటి, అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిపింది. రతన్ లాల్ కుటుంబానికి నష్టపరిహారం కోరుతూ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) ముందు పిటిషన్ దాఖలు చేసిన తరువాత కేంద్రం ఈ ప్రకటన చేసింది. కాగా మంగళవారం, హోంమంత్రి అమిత్ షా రతన్ లాల్ భార్యకు ఒక లేఖ రాశారు, “మీ భర్త అకాల మరణం నాకు దు:ఖాన్ని కలిగించింది..మీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అతను కఠినమైన సవాళ్లను ఎదుర్కొన్న ధైర్యవంతుడు..విధేయుడైన పోలీసు. నిజమైన సైనికుడిలాగే, అతను దేశ సేవ కోసం జీవితాన్ని త్యాగం చేసాడు. దేశం మొత్తం మీతో ఉంది” అని అమిత్ షా పేర్కొన్నారు. 

ఈశాన్య ఢిల్లీలోని గోకుల్‌పురిలో సోమవారం సిఎఎకు అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగాయి. ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న రతన్ లాల్ ఆందోళనకారులు జరిపిన దాడిలో మృతి చెందారు. రతన్ లాల్ తలకు గాయాలై మరణించినట్లు ప్రాథమిక నివేదికలు తెలిపాయి. కానీ శవపరీక్ష నివేదిక తరువాత హెడ్ కానిస్టేబుల్ బుల్లెట్ గాయాలతో మరణించినట్లు నిర్ధారించారు. శవపరీక్ష నివేదిక ప్రకారం, బుల్లెట్ ఎడమ భుజం ద్వారా అతని శరీరంలోకి ప్రవేశించి కుడి భుజం వరకు వెళ్లి అతని మరణానికి దారితీసింది.

ఇది కూడా చదవండి : “రెండేళ్లుగా పెన్షన్ లేదయ్యా”..చలించిపోయిన కలెక్టర్..