“రెండేళ్లుగా పెన్షన్ లేదయ్యా”..చలించిపోయిన కలెక్టర్..

లేటు వయసులో వృద్దుల బ్రతుకుకు ఆసరా కోసం ప్రభుత్వం పింఛన్ ఇస్తోంది. కానీ అది మంజూరు చెయ్యడానికి కొందరు ప్రభుత్వాధికారులు వయసుమళ్లిన వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా అటువంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ పట్టించుకుంటే కానీ ఆ వ‌ృద్దురాలి సమస్య పరిష్కారం కాలేదు.

రెండేళ్లుగా పెన్షన్ లేదయ్యా..చలించిపోయిన కలెక్టర్..
Follow us

| Edited By:

Updated on: Feb 26, 2020 | 10:24 PM

లేటు వయసులో వృద్దుల బ్రతుకుకు ఆసరా కోసం ప్రభుత్వం పింఛన్ ఇస్తోంది. కానీ అది మంజూరు చెయ్యడానికి కొందరు ప్రభుత్వాధికారులు వయసుమళ్లిన వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా అటువంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ పట్టించుకుంటే కానీ ఆ వ‌ృద్దురాలి సమస్య పరిష్కారం కాలేదు.

జయశంకర్ భూపాలపల్లి మండలం గుర్రంపల్లి గ్రామంలో నివశించే గిరిజన వృద్ధ మహిళ అజ్మీర మంగమ్మ (70) రెండు సంవత్సరాలుగా పెన్షన్ కోసం ప్రభుత్వ ఆఫీసులు చుట్టూ తిరుగుతోంది. కానీ ఏవోవే కారణాలు చెప్తూ ఆమెకు అధికారులు ఇంతవరకు పెన్షన్ మంజూరు చెయ్యలేదు. తాజాగా పట్టణ ప్రగతి కార్యక్రమానికి హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్థానిక ఎమ్మెల్యేగండ్రా వెంకటరమణా రెడ్డిలతో కలిసి కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం తన కార్యాలయానికి వచ్చారు. ఆ సమయంలో వృద్దురాలు ఆఫీసు మెట్లపై ఆయనకు తారసపడింది. వెంటనే ఆవిడ దగ్గరకు వెళ్లిన కలెక్టర్..ఎందుకు ఇక్కడ కూర్చున్నావని ప్రశ్నించారు. రెండు సంవత్సరాలు పింఛన్ రావడం లేదని..తినడానికి కూడు ఉండటం లేదని ఆమె కష్టాలను కలెక్టరు ముందు ఏకరవు పెట్టింది. దీంతో చలించిపోయిన కలెక్టర్…ఆమె పక్కనే కూర్చోని, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సుమతితో ఫోన్‌లో మాట్లాడి పెన్షన్ మంజూరు చేయించారు. 70 ఏళ్ల వృద్ద గిరిజన మహిళకు ఆమెకు కావాల్సిన పత్రాలు ఏం తెలుస్తాయి..వాళ్లు చదువులు ఏపాటివి..?. స్థానిక అధికారులు పనితీరు ఇలా ఉంటే సగటు మనిషి బ్రతికేదెలా..?.

ఇది కూడా చదవండి : పెళ్లిలోనూ ‘అమరావతి’ నినాదమే..