Tablighi Jamaath ఢిల్లీ సదస్సులో అసలేం జరిగింది? ఇదే వీడియో సాక్ష్యం

| Edited By: Pardhasaradhi Peri

Apr 01, 2020 | 7:06 PM

ఇపుడు దేశాన్ని కలవరపరుస్తున్న తబ్లిఘి జమాత్ సదస్సులో అసలేం జరిగింది? దేశం యావత్తు కరోనా కలకలంలోకి జారుకుంటున్న కీలక సమయంలో జరిగిన ఈ సదస్సుకు ముందే ఢిల్లీ పోలీసులు వార్నింగ్ ఇచ్చినా ఏ మాత్రం ఖాతరు చేయకుండా సదస్సులో ఏం చేశారు?

Tablighi Jamaath ఢిల్లీ సదస్సులో అసలేం జరిగింది? ఇదే వీడియో సాక్ష్యం
Follow us on

Delhi police released Tablighi Jamaath conference video: ఇపుడు దేశాన్ని కలవరపరుస్తున్న తబ్లిఘి జమాత్ సదస్సులో అసలేం జరిగింది? దేశం యావత్తు కరోనా కలకలంలోకి జారుకుంటున్న కీలక సమయంలో జరిగిన ఈ సదస్సుకు ముందే ఢిల్లీ పోలీసులు వార్నింగ్ ఇచ్చినా ఏ మాత్రం ఖాతరు చేయకుండా సదస్సులో ఏం చేశారు? సామాజిక దూరం పాటించాలన్న ప్రచారం మొదలై.. అప్పటికే వారం గడిచింది. ఆ మేరకు ఢిల్లీ పోలీసులు, మునిసిపల్ అధికారులు సదస్సు నిర్వాహకులను హెచ్చరించారు. అయితేనేం.. వాళ్ళు చేయాలనుకున్నదే చేసేశారు.

ఢిల్లీలో మార్చి 13 నుంచి 15వ తేదీల మధ్య జరిగిన తబ్లిఘి జమాత్ సదస్సు జరిగింది. ప్రార్థనలతో మొదలై.. ఆ తర్వాత దేశంలో ముస్లిం మతాన్ని ఎలా వ్యాప్తి చేయాలనే అంశంపై మేధోమధనం జరిగింది. ఇదంతా వారి మతానికి సంబంధించిన అంశం కావచ్చు. కానీ.. ఒకవైపు కరోనా వ్యాప్తి మొదలైన సందర్భంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఢిల్లీ అధికార యంత్రాంగం చేసిన సూచనలను ఏ మాత్రం పట్టించుకోలేదు అనడానికి సాక్ష్యాన్ని రిలీజ్ చేశారు ఢిల్లీ పోలీసులు.

ఒకే హాల్లో వందల మంది వుండిపోవడం.. సామాజిక దూరాన్ని ఏ మాత్రం ఖాతరు చేయకపోవడం సదస్సులో క్లియర్‌గా కనిపిస్తోంది. అదే సమయంలో కనీసం సదస్సు పూర్తి అయిన తర్వాత నైనా ప్రభుత్వాల సూచనలను పాటించని పరిస్థితి. నింపాదిగా వివిధ రాష్ట్రాలకు బయలుదేరిన తబ్లిఘీ జమాత్ కార్యకర్తలు యధేచ్ఛగా వైరస్‌ను వందల మందికి అంటించేశారు. ఇలాంటి బాధ్యతారాహిత్యానికి తగిన శాస్తి జరగాలనే ఉద్దేశంతోనే ఢిల్లీ పోలీసులు.. సదస్సు నిర్వహాకులకు నోటీసులిచ్చారు. కేసులు నమోదు చేసి విచారణ జరిపిస్తున్నారని తెలియజేస్తున్నారు ఢిల్లీ పోలీసు కమిషనర్.