నెల్లూరులో టెన్ష‌న్.. కరోనాతో ఢిల్లీవాసి మృతి

| Edited By: Pardhasaradhi Peri

Apr 28, 2020 | 2:59 PM

నెల్లూరులో కోవిడ్-19తో ఢిల్లీవాసి చనిపోవడం ప్ర‌జ‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేసింది. నారాయణ ఆస్పత్రిలో అత‌డు చికిత్సపొందుతూ ప్రాణాలు విడిచిన‌ట్టు అధికారులు తెలిపారు. ఢిల్లీకి చెందిన 9 మంది మత ప్రార్థనల నిమిత్తం రెండునెలల క్రితం నెల్లూరు వచ్చారు. ఓ ప్రార్థనా మందిరంలో వీరంతా నివాసం ఉంటున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం ఢిల్లీ మర్కజ‌్‌కు వెళ్లొచ్చిన వారితో కలిసి ప్రార్థనలు చేశారు. విషయం జిల్లా అధికారులకు తెలియడంతో వారంద‌ర్నీ ఈ నెల 16న ఐసోలేషన్ వార్డుకు తరలించి క‌రోనా […]

నెల్లూరులో టెన్ష‌న్.. కరోనాతో ఢిల్లీవాసి మృతి
Follow us on

నెల్లూరులో కోవిడ్-19తో ఢిల్లీవాసి చనిపోవడం ప్ర‌జ‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేసింది. నారాయణ ఆస్పత్రిలో అత‌డు చికిత్సపొందుతూ ప్రాణాలు విడిచిన‌ట్టు అధికారులు తెలిపారు. ఢిల్లీకి చెందిన 9 మంది మత ప్రార్థనల నిమిత్తం రెండునెలల క్రితం నెల్లూరు వచ్చారు. ఓ ప్రార్థనా మందిరంలో వీరంతా నివాసం ఉంటున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం ఢిల్లీ మర్కజ‌్‌కు వెళ్లొచ్చిన వారితో కలిసి ప్రార్థనలు చేశారు. విషయం జిల్లా అధికారులకు తెలియడంతో వారంద‌ర్నీ ఈ నెల 16న ఐసోలేషన్ వార్డుకు తరలించి క‌రోనా టెస్టులు చేశారు.

ఫ‌లితాల్లో 8 మందికి క‌రోనా పాజిటివ్ అని తేలింది. వీరికి ఆస్పత్రిలోనే ట్రీట్మెంట్ అందిస్తున్నారు.చికిత్స పొందుతూ వీరిలో ఒక వ్య‌క్తి మృతి చెందాడు. సోమవారం మరో వ్యక్తి చనిపోయాడు. ఇతనికి ఇత‌ర ఆరోగ్య స‌మ‌స్యలు ఉండ‌టంతోనే చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. నెల్లూరు జిల్లాలో మొత్తం 82 క‌రోనా పాజిటివ్ కేసులు ఉంటే.. 56 యాక్టివ్‌గా ఉన్నాయి.