ప్రధాని పర్యటనతో ఆర్మీ ఆత్మ‌స్థైర్యం రెట్టింపు : రాజ్‌నాథ్

|

Jul 03, 2020 | 5:12 PM

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ లడాఖ్ ఆక‌స్మిక ప‌ర్య‌ట‌న‌ భారత సైన్యంలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని భారత ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ప్రధాని అత్యవసర టూర్ పై ట్విట్టర్ వేదికగా రాజ్‌నాథ్ స్పందించారు. లఢాఖ్ లోయలో మోదీ ప‌ర్య‌ట‌న మ‌రింత ధైర్యాన్ని ఇచ్చిందన్నారు.

ప్రధాని పర్యటనతో ఆర్మీ ఆత్మ‌స్థైర్యం రెట్టింపు : రాజ్‌నాథ్
Follow us on

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ లడాఖ్ ఆక‌స్మిక ప‌ర్య‌ట‌న‌ భారత సైన్యంలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని భారత ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ప్రధాని అత్యవసర టూర్ పై ట్విట్టర్ వేదికగా రాజ్‌నాథ్ స్పందించారు. లఢాఖ్ లోయలో మోదీ ప‌ర్య‌ట‌న మ‌రింత ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. భార‌త సైన్యం నీడ‌లో దేశ స‌రిహ‌ద్దులు ఎప్పుడూ సుర‌క్షితంగా ఉంటాయన్న రాజ్‌నాథ్.. ల‌డ‌ఖ్‌లో మోదీ పర్యటించడం ప్ర‌తీ సైనికుడి ఆత్మ‌స్థైర్యం మ‌రింత రెట్టింప‌య్యింద‌న్నారు. మోదీ చ‌ర్య‌ను స్వాగ‌తిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. కొద్ది రోజులుగా చైనా-భారత్ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త ఘర్షణ వాతావరణాన్ని సమీక్షింంచేందుకు రాజ్‌నాథ్ ల‌డ‌ఖ్ వెళ్లాల్సి ఉండ‌గా, ప్రధాని పర్యటన కారణంగా రద్దైంది. ప్ర‌ధాని మోదీ ల‌ఢాఖ్‌లోని లేహ్‌లో పర్యటించి అక్క‌డి ప‌రిస్థితుల‌పై ఆర్మీ అధికారులతో స‌మీక్షించారు. స‌రిహ‌ద్దు వివాదంపై భార‌త్-చైనా క‌మాండ‌ర్ స్థాయి స‌మావేశాల్లో పాల్గొన్న సైనికాధికారుల‌తో ప్రధాని సమావేశమయ్యారు.