AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనా చేతిలో ఘోరంగా మోసపోయిన పాక్.. N95మాస్కులంటూ.. వాటిని అంటగట్టారట..!

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే 54వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. పది లక్షల మందికి పైగా వైరస్ సోకి ఆస్పత్రి పాలయ్యారు. అయితే ప్రస్తుతం ఈ వైరస్‌ పుట్టిన చైనాలో కరోనా ప్రభావం దాదాపు తగ్గిపోయింది. అంతేకాదు.. ప్రస్తుతం అక్కడి మార్కెట్లు అన్నీ ఓపెన్ అయ్యాయి. అంతే కాదు.. ఇతర దేశాలకు కావాల్సిన వైద్య పరికరాలు, ఇతర సామాగ్రిని విదేశాలకు ఎక్స్‌పోర్ట్ కూడా చేస్తోంది. ఈ […]

చైనా చేతిలో ఘోరంగా మోసపోయిన పాక్.. N95మాస్కులంటూ.. వాటిని అంటగట్టారట..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 04, 2020 | 3:50 PM

Share

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే 54వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. పది లక్షల మందికి పైగా వైరస్ సోకి ఆస్పత్రి పాలయ్యారు. అయితే ప్రస్తుతం ఈ వైరస్‌ పుట్టిన చైనాలో కరోనా ప్రభావం దాదాపు తగ్గిపోయింది. అంతేకాదు.. ప్రస్తుతం అక్కడి మార్కెట్లు అన్నీ ఓపెన్ అయ్యాయి. అంతే కాదు.. ఇతర దేశాలకు కావాల్సిన వైద్య పరికరాలు, ఇతర సామాగ్రిని విదేశాలకు ఎక్స్‌పోర్ట్ కూడా చేస్తోంది. ఈ క్రమంలో మిత్రదేశమైన పాకిస్థాన్‌ను కరోనా మహమ్మారి నుంచి రక్షించేందుకు ఆ దేశానికి కావాల్సిన వైద్య పరికరాలు, సామాగ్రిని అందించేందుకు అంగీకారం తెలిపిందట. గత వారం రోజులుగా పాకిస్థాన్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. అ క్రమంలో వైద్యులకు కావాల్సిన మాస్క్‌ల కొరత ఏర్పడింది. ఈ క్రమంలో పాకిస్థాన్‌కు మంచి నాణ్యమైన N95 మాస్క్‌లు అందజేస్తామని చైనా హామీ ఇచ్చిందట.

ఇచ్చిన మాట ప్రకారం చైనా పాకిస్థాన్‌కు N95 మాస్క్‌లను పంపించింది. అయితే వాటిని ఓపెన్‌ చేసి చూస్తే షాక్‌ తిన్నారు అక్కడి అధికారులు. మాస్క్‌ల పేరు చెప్పి చైనా మోసం చేసినట్లు పాకిస్థాన్‌కు చెందిన ఓ మీడియా ప్రత్యేక కథనాన్ని ప్లే చేసింది. “చైనా నే చునా లగా దియా” అంటూ ఓ పాకిస్థాన్ మీడియా పేర్కొంది. నాణ్యమైన మాస్క్‌లు అందజేస్తామని చెప్పి.. అక్కడి వారు వాడిపడేసిన లోదుస్తులను, ఇన్నర్‌వేర్‌లతో తయారు చేసిన మాస్క్‌లను పాకిస్థాన్‌కు పంపిందంటూ పేర్కొంది. సింధ్ ప్రావిన్స్‌లోని ప్రభుత్వాధికారులు ఈ మాస్క్‌లను చెక్ చేయకుండానే ఆస్పత్రులకు పంపించారని తెలిపింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

China promised to send top quality N-95 masks to Pakistan. When the consignment landed, Pakistanis found that China had sent masks made of underwear.

Pakistani anchor says “China ne Choona laga diya”. #ChineseVirusCorona pic.twitter.com/3H4Uo151ZJ

— Major Gaurav Arya (Retd) (@majorgauravarya) April 4, 2020