కరోనా నేర్పిన గుణపాఠం.. ప్రధాని మోదీ

కరోనా మహమ్మారి మనకు గొప్ప గుణపాఠం నేర్పిందని అన్నారు ప్రధాని మోదీ. ఈ కష్ట సమయంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉండి కరోనాను తరిమికొట్టాలన్నారు. పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం దేశ వ్యాప్తంగా ఎంపికైన సర్పంచులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు...

కరోనా నేర్పిన గుణపాఠం.. ప్రధాని మోదీ

Edited By:

Updated on: Apr 24, 2020 | 12:21 PM

కరోనా మహమ్మారి మనకు గొప్ప గుణపాఠం నేర్పిందని అన్నారు ప్రధాని మోదీ. ఈ కష్ట సమయంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉండి కరోనాను తరిమికొట్టాలన్నారు. పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం దేశ వ్యాప్తంగా ఎంపికైన సర్పంచులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ-గ్రామ స్వరాజ్ పోర్టల్, మొబైల్ యాప్ ను లాంచ్ చేసిన మోడీ.. గ్రామాల్లో సుపరిపాలన అందించేందుకు పంచాయతీ రాజ్ శాఖ ఎంతో కృషి చేస్తోందన్నారు. ప్రస్తుతం లక్షా ఇరవై అయిదు వేల పంచాయతీల్లో బ్రాడ్ బ్యాండ్ సేవలు అందుతున్నాయని ఆయన చెప్పారు. పంచాయతీరాజ్ ఎంత బలపడితే ప్రజాస్వామ్యం అంత బలపడుతుందన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామంలో విద్యుత్, రహదారులు, పారిశుధ్యంపై చర్యలు చేపట్టాలని మెరుగైన పనితీరు కనబరచిన గ్రామా పంచాయతీలకు అవార్డులు ఇస్తామని ఆయన ప్రకటించారు. ఈ కష్ట సమయంలో ప్రజలంతా ఆత్మా స్థయిర్యం తో ఉండాలని ఆయన సూచించారు.

స్వావలంబన సాధించాలని, దేనికైనా ఇతరులపై ఆధారపడకుండా ఉండాలన్న గుణపాఠాన్ని కరోనా నేర్పిందని ఆయన పేర్కొన్నారు. మన మనుగడకు మనమే మనపై ఆధారపడి ఉండాలి.. ఇదే ఈ మహమ్మారి నేర్పింది.. నగరాల కన్నా గ్రామాలు ఈ సంక్షోభాన్ని బాగా హాండిల్ చేస్తున్నాయి.. మీ నుంచి..(సర్పంచుల నుంచి) మేం నేర్చుకోవలసింది ఎంతో ఉంది అన్నారాయన.  ముఖ్యంగా నగరాలతో పోలిస్తే గ్రామాల్లో క్రమశిక్షణతో సామాజిక దూరాన్ని బాగా పాటిస్తున్నారని మోదీ పేర్కొన్నారు. ఈ తరుణంలో టెక్నాలజీ కూడా కీలక పాత్ర వహిస్తోందన్నారు.