రామమందిర నిర్మాణం ప్రారంభంతో కరోనా ఖతం..!

| Edited By:

Jul 23, 2020 | 12:08 PM

అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రారంభమైతే.. యావత్ ప్రంపచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి అంతమవుతుందన్నారు మధ్యప్రదేశ్‌ ప్రోటెమ్ స్పీకరర్, బీజేపీ నేత రామేశ్వ‌ర్ శర్మ. ప్రజా సంక్షేమం, రాక్షస సంహారం..

రామమందిర నిర్మాణం ప్రారంభంతో కరోనా ఖతం..!
Follow us on

అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రారంభమైతే.. యావత్ ప్రంపచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి అంతమవుతుందన్నారు మధ్యప్రదేశ్‌ ప్రోటెమ్ స్పీకరర్, బీజేపీ నేత రామేశ్వర్ శర్మ. ప్రజా సంక్షేమం, రాక్షస సంహారం కోసమే శ్రీరామ చంద్రుడు అవతరించారన్నారు. అయోధ్యలో శ్రీ రాముడి ఆలయ నిర్మాణం పనులు ప్రారంభమైన క్షణం నుంచి.. ఈ కరోనా మహమ్మారి అంతం ప్రారంభమవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ మహమ్మారి ఒక్క మనదేశంలోనే కాకుండా.. యావత్ ప్రపంచ దేశాలను వణికిస్తోందన్నారు. ఆగస్టు 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరగబోతోంది. ఈ విషయాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు కోశాధికారి స్వామి గోవిద్‌ దేవ్‌ తెలిపారు. ఈ మందిర నిర్మాణ కార్యక్రామనికి అన్ని రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానాలను పంపినట్లు ట్రస్టు ప్రకటించింది. మందిర నిర్మాణం మూడేళ్లలో పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.