చెన్నై.. 4 జిల్లాల్లో ఈ నెల 19 నుంచి 30 వరకు పూర్తి లాక్ డౌన్

| Edited By: Anil kumar poka

Jun 15, 2020 | 4:44 PM

రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతుండడంతో చెన్నైతో బాటు నాలుగు జిల్లాల్లో ఈ నెల 19 నుంచి 30 వరకు పూర్తి లాక్ డౌన్ విధిస్తున్నట్టు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో లాక్ డౌన్ విధించాలని సోమవారం సమావేశమైన కేబినెట్ నిర్ణయించింది.

చెన్నై.. 4 జిల్లాల్లో ఈ నెల 19 నుంచి 30 వరకు పూర్తి లాక్ డౌన్
Follow us on

రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతుండడంతో చెన్నైతో బాటు నాలుగు జిల్లాల్లో ఈ నెల 19 నుంచి 30 వరకు పూర్తి లాక్ డౌన్ విధిస్తున్నట్టు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో లాక్ డౌన్ విధించాలని సోమవారం సమావేశమైన కేబినెట్ నిర్ణయించింది. కరోనా వైరస్ వ్యాప్తిని అదుపు చేసేందుకు చెన్నైలో లాక్ డౌన్ ఆంక్షల సడలింపులను  మళ్ళీ కఠినతరం చేయాలని నిపుణుల కమిటీ సూచించింది.

రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 1974 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో ఈ కేసుల సంఖ్య మొత్తం 44,6661 కి పెరిగింది. ఇప్పటివరకు 435 మంది రోగులు మరణించగా… 24,547 మంది కోలుకున్నారు. ఇలా ఉండగా ఈ జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకు స్టోర్స్, కూరగాయల దుకాణాలు, పెట్రోలు బంకులు, మొబైల్ మార్కెట్లు తెరచి ఉంచుతారు. ప్రజలు తమ ఇళ్ల నుంచి రెండు కిలోమీటర్ల పరిధిలోపే తమ సొంత వాహనాలపై ప్రయాణించవలసి ఉటుంది. అత్యవసర సర్వీసులు, ట్రావెల్, వైద్యపరమైన ఎమర్జెన్సీలను అనుమతిస్తారు. అలాగే ఆటోలు, టాక్సీలకు  వైద్యపరమైన అత్యవసర సమయాల్లో పర్మిషన్ ఉంటుంది. బ్యాంకులు ఈ నెల 29, 30 తేదీల్లో 33 శాతం సిబ్బందితో మాత్రమే పని చేయవలసి ఉంటుంది. రాష్ట్ర, కేంద్ర కార్యాలయాలు కూడా 33 శాతం ఉద్యోగులతో పని చేయాలని గైడ్ లైన్స్ లో పేర్కొన్నారు. హోటళ్లను  ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరచి ఉంచినప్పటికీ… టేకోవర్ సర్వీసులు మాత్రమే ఉంటాయి.