తెలంగాణ బడ్జెట్.. ఇది కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్: రూ.లక్షా 82 వేల 17 కోట్లు. రెవెన్యూ వ్యయం: రూ.లక్షా 31 వేల 629 కోట్లు. ఆర్థికలోటు: రూ.27,749 కోట్లు. రెవెన్యూ మిగులు: రూ. రూ.6,564 కోట్లు. సీఎం హోదాలో కేసీఆర్ తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. తెలంగాణ ముఖచిత్రాన్ని వివరిస్తూ ఎదుర్కొన్న సవాళ్లను వాటిని అధిగమించిన తీరును వివరించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అమలు చేయబోయే కొత్త పథకాలను […]
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారు.
మొత్తం బడ్జెట్: రూ.లక్షా 82 వేల 17 కోట్లు. రెవెన్యూ వ్యయం: రూ.లక్షా 31 వేల 629 కోట్లు. ఆర్థికలోటు: రూ.27,749 కోట్లు. రెవెన్యూ మిగులు: రూ. రూ.6,564 కోట్లు.
సీఎం హోదాలో కేసీఆర్ తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. తెలంగాణ ముఖచిత్రాన్ని వివరిస్తూ ఎదుర్కొన్న సవాళ్లను వాటిని అధిగమించిన తీరును వివరించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అమలు చేయబోయే కొత్త పథకాలను వివరించారు. సంక్షేమ ఫలాలు తెలంగాణలో ప్రతి కుటుంబం అందుకుందని, అందుకే మరోసారి టీఆర్ఎస్‌కే పట్టం కట్టారని సీఎం కేసీఆర్ అన్నారు.
బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, వృద్ధులకు, గీత-నేత కార్మికులకు, వికలాంగులకు ఇచ్చే ఆసరా పెన్షన్‌ను పెంచుతున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా వృద్ధులకు, వితంతువులకు, ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు ఇచ్చే వెయ్యి రూపాయల పెన్షన్‌ను 2 వేల 16కు పెంచారు. అలాగే దివ్యాంగులకు 3 వేల 16 రూపాయలు ఇస్తున్నట్టు ప్రకటించారు. మొత్తం ఆసరా పెన్షన్లకు 12వేల 67 కోట్లనుు కేటాయించారు.
కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌తో బాల్య వివాహాలు గణనీయంగా తగ్గాయని, ఆడ పిల్లలున్న పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నాయన్నారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌లకు ఈ బడ్జెట్‌లో 1450 కోట్లు కేటాయిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం త్వరలో విధివిధానాలు ఖరారు చేస్తోందన్నారు. నిరుద్యోగ భృతిని అందించేందుకు 1800 కోట్ల రూపాయలను బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రాతిపదికన ప్రత్యేక ప్రగతి నిధిని ఏర్పాటు చేసి పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు కేసీఆర్.
రైతు బంధు పథకంతో తెలంగాణ దేశంలోనే రోల్‌మోడల్‌గా నిలిచిందన్నారు. ప్రస్తుతం ఇస్తున్న 8వేల సహాయాన్ని 10వేలకు పెంచుతూ బడ్జెట్‌లో కేటాయింపులు చేశామన్నారు. ఇందుకు 12 వేల కోట్ల రూపాయిలను ప్రతిపాదించారు. ఏ కారణంతోనైనా రైతు చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు.
రైతు సంక్షేమమే పరమావధిగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు కేసీఆర్. ప్రతీ ఎకరానికి నీరు అందేలా ప్రణాళికను సిద్ధం చేశామని, కాల్వల ద్వారా చెరువులు నింపే బృహత్తర ప్రణాళికను రెడీ చేస్తున్నామన్నారు. ఈ బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు 22వేల 500 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు.
సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో కర్నాటక తర్వాత తెలంగాణ రాష్ట్రం ఉందని, ఇది మనందరికీ గర్వకారణమన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉందని, ఇది మానవ ప్రగతికి సూచికగా భావించాలని కేసీఆర్ అన్నారు.