జగన్ గుడ్‌న్యూస్.. అమరావతి రైతుల్లో ఆనందం!

| Edited By:

Feb 05, 2020 | 1:49 PM

దాదాపు 49 రోజుల నుంచి అమరావతి రైతులు నిరసన చేస్తోన్న నేపథ్యంలో కొంతమంది.. సీఎం జగన్‌ను కలిశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి, తాడిగొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేశి ఆధ్వర్యంలో కొందరు రైతులు ముఖ్యమంత్రితో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలపై జగన్ వారితో చర్చించారు. రాజధాని గ్రామాల్లో బలవంతంపు భూసేకరణ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు రైతులు. వారి వినతులపై స్పందించిన జగన్.. రాజధాని గ్రామాల్లో భూసేకరణ నోటిఫికేషన్‌ను ఎత్తివేస్తున్నట్లు.. రైతులకు స్పష్టం చేశారు. […]

జగన్ గుడ్‌న్యూస్.. అమరావతి రైతుల్లో ఆనందం!
Follow us on

దాదాపు 49 రోజుల నుంచి అమరావతి రైతులు నిరసన చేస్తోన్న నేపథ్యంలో కొంతమంది.. సీఎం జగన్‌ను కలిశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి, తాడిగొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేశి ఆధ్వర్యంలో కొందరు రైతులు ముఖ్యమంత్రితో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలపై జగన్ వారితో చర్చించారు. రాజధాని గ్రామాల్లో బలవంతంపు భూసేకరణ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు రైతులు. వారి వినతులపై స్పందించిన జగన్.. రాజధాని గ్రామాల్లో భూసేకరణ నోటిఫికేషన్‌ను ఎత్తివేస్తున్నట్లు.. రైతులకు స్పష్టం చేశారు. గతంలో తాడేపల్లి పరిధిలో టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘యూ1’ జోన్‌ను ఎత్తివేస్తానని రైతులకు సీఎం హామీ ఇచ్చారు. 29 గ్రామాల్లో దాదాపు 5 వేల ఎకరాల్లో బలవంతంపు భూసేకరణకు గత ప్రభుత్వం నోటిఫికేషన్‌కు ఇచ్చింది.