నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

| Edited By:

Jul 23, 2019 | 4:46 PM

స్టాక్ మార్కెట్లు షేక్ చేస్తున్నాయి. సూచీలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి. మంగళవారం ఉదయం 100 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్ 38 వేల పాయింట్లకు ఒక్కసారిగా పడిపోయింది. బీఎస్సీ సెన్సెక్స్ 48.39 పాయింట్లు నష్టపోయి 37,982.74 వద్దకు వచ్చి చేరింది. అలాటే నిఫ్టీ కూడా 15.15 పాయింట్ల నష్టంతో 11,331 పాయింట్లకు తగ్గిపోయింది. ఉదయం నుంచి ఒకే రీతిలో నష్టాల్లోనే సూచీలు కొనసాగాయి. ఇన్వెస్టర్లు గత నాలుగు రోజులుగా నష్టాలనే […]

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Follow us on

స్టాక్ మార్కెట్లు షేక్ చేస్తున్నాయి. సూచీలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి. మంగళవారం ఉదయం 100 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్ 38 వేల పాయింట్లకు ఒక్కసారిగా పడిపోయింది. బీఎస్సీ సెన్సెక్స్ 48.39 పాయింట్లు నష్టపోయి 37,982.74 వద్దకు వచ్చి చేరింది. అలాటే నిఫ్టీ కూడా 15.15 పాయింట్ల నష్టంతో 11,331 పాయింట్లకు తగ్గిపోయింది. ఉదయం నుంచి ఒకే రీతిలో నష్టాల్లోనే సూచీలు కొనసాగాయి.

ఇన్వెస్టర్లు గత నాలుగు రోజులుగా నష్టాలనే చవిచూడాల్సి వస్తోంది. అయితే మంగళవారం స్టాక్ మార్కెట్లు లాభాల దిశగా పయనించకపోడానికి ప్రధానంగా విదేశీ మదుపరులు స్వీకరణ, కార్పొరేట్ సంస్ధల ఆదాయాలు తక్కువగా ఉండటం.. మార్కెట్ బలహీనంగా ఉండటంలో ప్రభావ చూపిందని స్టాక్ మార్కెట్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.
మంగళవారం ప్రధానంగా నష్టాల బాటలో పయనించిన షేర్లను చూస్తే.. ప్రభుత్వ రంగ భ్యాంకుల షేర్లు, ఆటో, మెటల్, ఫార్మా, ఎఫ్ఎమ్‌సీజీ, ఎనర్జీ, ఇన్‌ఫ్రా, ఐటీ షేర్లు 3 శాతం మేర నష్టాపోయాయి. అలాగే ఎస్‌బీఐ, ఇండియాబుల్స్, హౌసింగ్ హెచ్‌డీఎఫ్‌సీ, ఆదానీ పోర్ట్స్, బజాజ్ ఆటో వంటి షేర్లు సైతం నష్టాల్లో కొనసాగాయి. ‘