బాబు నోట విధ్వంసం మాట.. ఎవరికో ఈ హెచ్చరిక?

|

Nov 28, 2019 | 4:06 PM

మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు విధ్వంసం గురించి మాట్లాడారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించిన చంద్రబాబు.. మధ్యలో జాతీయ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విధ్వంసం ప్రస్తావన తేవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. రాజధాని ప్రాంతంలో గత ప్రభుత్వం ప్రారంభించిన కట్టడాలను జగన్ సర్కార్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందని చంద్రబాబు, ఇతర టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. అసలు రాజధాని ప్రాంతంలో నిర్మాణాలే జరగలేదని వైసీపీ నేతలు అబద్దపు […]

బాబు నోట విధ్వంసం మాట.. ఎవరికో ఈ హెచ్చరిక?
Follow us on

మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు విధ్వంసం గురించి మాట్లాడారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించిన చంద్రబాబు.. మధ్యలో జాతీయ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విధ్వంసం ప్రస్తావన తేవడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

రాజధాని ప్రాంతంలో గత ప్రభుత్వం ప్రారంభించిన కట్టడాలను జగన్ సర్కార్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందని చంద్రబాబు, ఇతర టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. అసలు రాజధాని ప్రాంతంలో నిర్మాణాలే జరగలేదని వైసీపీ నేతలు అబద్దపు ప్రచారం చేస్తున్నారని, జరుగుతున్న వాటిని ప్రపంచానికి చూపిస్తానని చంద్రబాబు అమరావతి పర్యటనకు పూనుకున్నారు.

అయితే, గురువారం ఉదయం రాజధాని ప్రాంతానికి చేరుకున్న చంద్రబాబు పర్యటనకు మిశ్రమ స్పందన కనిపించింది. తొలుత బాబును రావద్దంటూ అడ్డుకున్న కొందరు రైతులు.. ఆయన పయనిస్తున్న బస్సుపై రాళ్ళు, చెప్పులు విసిరారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆయన దిష్టిబొమ్మను తగులబెట్టారు. ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో చంద్రబాబును ఘన స్వాగతం పలికారు కొందరు రైతులు.

ఈక్రమంలో నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో ఉద్విగ్నానికి గురయ్యారు. శిలాపలకానికి సాష్టాంగ వందనం చేశారు. ఆ తర్వాత జాతీయ మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ విధ్వంసం చేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారాయన. రాజధాని ప్రాంతాన్ని జగన్ విధ్వంసం చేస్తున్నారని, ఫలితంగా రాష్ట్రం క్రెడిబిలిటీ కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు. మొత్తానికి చంద్రబాబు పర్యటన లాగానే ఆయన చేసిన విధ్వంసం వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.