ప్రజాక్షేత్రంలో మోదీ, కేసీఆర్, జగన్ ల కుట్రలను ఎండగట్టాలి : చంద్రబాబు

ప్రధాని నరేంద్ర మోదీ, కేసీఆర్, జగన్ ల కుట్రలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు. శుక్రవారం ఉదయం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రాభివృద్ది కోసం మనం కేంద్రంతో యుద్ధం చేస్తున్నామన్నారు. బంధుత్వాలు వేరు.. పార్టీ వేరు అనే స్ఫూర్తి అందరిలో రావాలన్నారు. ఏపీ రాష్ట్ర అభివృద్ధి కాకూడదనేదే ప్రధాని మోదీ, కేసీఆర్, జగన్ ల ఆలోచన అని, ముగ్గురి కుట్రలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని నేతలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ను మించి అమరావతి అభివృద్ధి […]

ప్రజాక్షేత్రంలో మోదీ, కేసీఆర్, జగన్ ల కుట్రలను ఎండగట్టాలి : చంద్రబాబు

Edited By:

Updated on: Oct 18, 2020 | 10:46 PM

ప్రధాని నరేంద్ర మోదీ, కేసీఆర్, జగన్ ల కుట్రలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు. శుక్రవారం ఉదయం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రాభివృద్ది కోసం మనం కేంద్రంతో యుద్ధం చేస్తున్నామన్నారు. బంధుత్వాలు వేరు.. పార్టీ వేరు అనే స్ఫూర్తి అందరిలో రావాలన్నారు. ఏపీ రాష్ట్ర అభివృద్ధి కాకూడదనేదే ప్రధాని మోదీ, కేసీఆర్, జగన్ ల ఆలోచన అని, ముగ్గురి కుట్రలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని నేతలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ను మించి అమరావతి అభివృద్ధి చెందితే మనుగడ ఉండదనేది వారి భయమన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో యుద్ధం చేస్తున్నాం.. కేంద్రంతో చేసే యుద్ధంలో గెలుపే మన లక్ష్యం అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.