హైదరాబాద్ లో ‘పరువు హత్య’కు బలైపోయిన హేమంత్ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హాస్పిటల్ నుండి హేమంత్ డెడ్ బాడీ ఇంటికి చేరుకుంది. యూకే నుండి హేమంత్ సోదరుడు కూడా హైదరాబాద్ చేరుకున్నాడు. హేమంత్ ను చివరి చూపు చూసుకునేందుకు బంధువులు స్నేహితులు అతని ఇంటికి చేరుకుంటున్నారు. మరోవైపు, హేమంత్ ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాగా, తన కూతురి ప్రేమ వివాహం ఇష్టం లేని అవంతిక తండ్రి, అతని కుటుంబసభ్యులు ఈ ఘాతుకానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. హేమంత్ హత్యలో అవంతిక కుటుంబసభ్యులే కీలక పాత్ర పోషించారని పోలీసులు చెబుతున్నారు. కిరాయి గుండాలతో హేమంత్‌ను మేనమామ యుగంధర్ రెడ్డి హత్య చేయించినట్లు పోలీసులు వెల్లడించారు. హేమంత్ హత్య కోసం యుగంధర్ రూ.10 లక్షలు ఇచ్చాడని.. చందానగర్‌కు చెందిన ఇద్దరు కిరాయి గుండాలతో హత్య చేయించినట్లుగా పోలీసులు గుర్తించారు.