జూమ్ యాప్‌కు నో.. ఈ-కామర్స్‌ ఓకే.. కేంద్రం తాజా ఆదేశం

లాక్ డౌన్ పీరియడ్ కొనసాగుతున్న తరుణంలో కేంద్ర హోం శాఖ గురువారం రెండు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇందులో ఒకటి వెనువెంటనే అమల్లోకి వస్తుండగా.. మరొకటి ఏప్రిల్ 20వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని హోం శాఖ అధికారులు తెలిపారు.

జూమ్ యాప్‌కు నో.. ఈ-కామర్స్‌ ఓకే.. కేంద్రం తాజా ఆదేశం

Updated on: Apr 16, 2020 | 4:51 PM

Union Home ministry issued two crucial orders: లాక్ డౌన్ పీరియడ్ కొనసాగుతున్న తరుణంలో కేంద్ర హోం శాఖ గురువారం రెండు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇందులో ఒకటి వెనువెంటనే అమల్లోకి వస్తుండగా.. మరొకటి ఏప్రిల్ 20వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని హోం శాఖ అధికారులు తెలిపారు. దేశంలో లాక్ డౌన్ ఎగ్జిట్ దశ ప్రారంభమవుతున్న తరుణంలో కేంద్రం జారీ చేసిన ఈ రెండు ఆదేశాలు అత్యంత కీలకమని తెలుస్తోంది.

లాక్ డౌన్ ప్రారంభమైన తర్వాత తమ విద్యార్థుల కోసం చాలా విద్యాసంస్థలు ఆన్‌లైన్ క్లాసులను అందుబాటులోకి తెచ్చాయి. అందుకు రకరకాల అప్లికేషన్లను వినియోగిస్తున్నాయి. అయితే వీటిలో జూమ్ యాప్ అత్యంత వేగంగా ప్రజాదరణ చురగొన్నది. అనతికాలంలోనే జూమ్ యాప్ వినియోగం వందల రెట్లు పెరిగిపోయింది. మొత్తానికి ఒక సర్వే ప్రకారం గత పదిహేను రోజుల కాలంలో అత్యంత అధికంగా డౌన్ లోడ్ అయిన యాప్‌గా జూమ్ యాప్ రికార్డు సృష్టించింది. అయితే.. జూమ్ యాప్ వినియోగం అంత శ్రేయస్కరం కాదంటూ కేంద్ర హోం శాఖ బాంబ్ పేల్చింది. ఈ యాప్ ద్వారా రెండు మిలియన్ల వినియోగదారుల డేటా అన్యుల చేతికి వెళ్ళిపోయిందని ఓ సర్వే చెబుతోంది. ఈ క్రమంలో దేశపౌరులు జూమ్ యాప్ వినియోగించవద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ గురువారం ఆదేశాలను విడుదల చేసింది.

ఇక ఏప్రిల్ 20వ తేదీ నుంచి దేశంలో లాక్ డౌన్ ఎగ్జిట్ దశ ప్రారంభం కాబోతున్న తరుణంలో ఏప్రిల్ 20 తర్వాత ఏమేం అందుబాటులోకి వస్తాయన్నది చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఈకామర్స్ సంస్థల లావాదేవీలను అనుమతించనున్నట్లు హోం శాఖ ప్రకటించింది. మొబైల్ ఫోన్లు, టీవీలు, ఎసీలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఈ కామర్స్ సంస్థలైన అమేజాన్, ఫ్లిప్ కార్ట్ సహా ఇతర ఈకామర్స్ లావాదేవీలను ఏప్రిల్ 20వ తేదీ నుంచి అనుమతించనున్నట్లు హోం శాఖ సర్క్యులర్ విడుదల చేసింది.

read this: కేంద్రమిస్తున్న వస్తువులను జనాలకెందుకివ్వట్లేదు.. సీఎస్‌పై మండిపడ్డ సంజయ్