జగన్‌కు ఎన్నికల సంఘం నోటీసులు

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. వైసీపీ నుంచి ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్‌ను సస్పెండ్ చేసిన విషయంలో మార్చి 11వ తేదీలోపు విచారణకు హాజరు కావాలంటూ కేంద్రఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే తనను పార్టీ నుంచి బహిష్కరించడంపై శివకుమార్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన తనను బహిష్కరించే అధికారం ఎవరికీ లేదంటూ ఆయన సీఈసీని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన ఎన్నికల […]

జగన్‌కు ఎన్నికల సంఘం నోటీసులు

Edited By:

Updated on: Feb 14, 2020 | 1:56 PM

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. వైసీపీ నుంచి ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్‌ను సస్పెండ్ చేసిన విషయంలో మార్చి 11వ తేదీలోపు విచారణకు హాజరు కావాలంటూ కేంద్రఎన్నికల సంఘం ఆదేశించింది.

అయితే తనను పార్టీ నుంచి బహిష్కరించడంపై శివకుమార్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన తనను బహిష్కరించే అధికారం ఎవరికీ లేదంటూ ఆయన సీఈసీని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం జగన్‌కు నోటీసులు జారీ చేసింది. శివకుమార్‌ను ఎందుకు బహిష్కరించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.

అయితే 2009లో శివకుమార్ వైసీపీని స్థాపించారు. అనంతరం వైఎస్సార్ కుటుంబంపై ఉన్న అభిమానంతో పార్టీని జగన్‌కు అప్పగించారు. నాటి నుంచి జగన్ అధ్యక్షుడిగా, విజయమ్మ గౌరవాధ్యక్షురాలిగా కొనసాగుతుండగా.. శివకుమార్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. కాగా ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో శివ కుమార్, టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా కామెంట్లు చేయడంతో జగన్ అతడిని పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించిన విషయం తెలిసిందే.

Follow Us