ధీరాధి ధీరుడా.. నీకు స్వాగతం

| Edited By:

Mar 02, 2019 | 6:35 AM

అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన అభినందన్ సురక్షితంగా భారత్ చేరుకోవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. సరిహద్దుల్లో ఆనందోత్సవాలు వెల్లివెరిశాయి. శత్రువు చెరలో చిక్కినా స్థైర్యం కోల్పోలేదని అభినందన్‌ను యావత్ భారతావని కొనియాడుతోంది. అటు భారత గడ్డపై అడుగుపెట్టిన ధీరాధి ధీరుడు.. వీరాధి వీరుడు నిజమైన భారతీయుడు అభినందన్‌కు ఇప్పుడు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. క్షేమంగా భారత గడ్డపై అడుగుపెట్టిన అభినందన్‌కు సెల్యూట్ చేస్తూ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. పాకిస్థాన్ చెర నుంచి సురక్షితంగా భారత్‌కు చేరుకున్న […]

ధీరాధి ధీరుడా.. నీకు స్వాగతం
Follow us on

అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన అభినందన్ సురక్షితంగా భారత్ చేరుకోవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. సరిహద్దుల్లో ఆనందోత్సవాలు వెల్లివెరిశాయి. శత్రువు చెరలో చిక్కినా స్థైర్యం కోల్పోలేదని అభినందన్‌ను యావత్ భారతావని కొనియాడుతోంది.

అటు భారత గడ్డపై అడుగుపెట్టిన ధీరాధి ధీరుడు.. వీరాధి వీరుడు నిజమైన భారతీయుడు అభినందన్‌కు ఇప్పుడు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. క్షేమంగా భారత గడ్డపై అడుగుపెట్టిన అభినందన్‌కు సెల్యూట్ చేస్తూ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

పాకిస్థాన్ చెర నుంచి సురక్షితంగా భారత్‌కు చేరుకున్న వింగ్ కమాండర్ అభినందన్‌కు స్వాగతం అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. అభినందన్‌ను చూసి దేశం గర్వపడుతోంది అంటూ ట్వీట్ చేశారు. భారత యువతకు అభినందన్ మార్గదర్శకుడు అని రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు. శత్రుదేశంపై అభినందన్ వీరోచిత పోరాటం నిజంగా అభినందనీయం అన్నారు.

అభినందన్ స్వదేశానికి తిరిగి రావడం సంతోషంగా ఉందన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ. అభినందన్ చూసిన దేశభక్తికి వందనం అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. అభినందన్ ఎంతో ధైర్యశాలి అంటూ బాబు ట్వీట్ చేశారు.

స్వదేశానికి అభినందన్ తిరిగి రావడం ఆనందదాయకం అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సూపర్‌ హీరోకు స్వాగతం అంటూ ఏపీ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. అభినందన్‌ను చూసి దేశం గర్వపడుతుందన్నారు నారా లోకేశ్.

అభినందన్‌కు సాదర స్వాగతం పలుకుతూ.. దేశవ్యాప్తంగా సెలబ్రిటీలు ట్వీట్లు చేశారు. బాలీవుడ్ బాద్‌షా ఖాన్ ట్వీట్ చేశారు. అభినందన్.. నువ్వు 130కోట్ల మంది ధైర్యానివి అంటూ ట్వీట్ చేశాడు. అభినందన్ ఇండియాకు రావడం తనకు చాలా సంతోషంగా ఉందని కింగ్‌ఖాన్ చెప్పాడు. సొంత ఇంటిని మించిన శాంతి మరోకటి ఉండదని.. సొంత ఇంటికి వచ్చినప్పుడు ఉండే కలలు, నమ్మకం ఇంకెక్కడా కూడా మనకు దొరకవని ట్వీట్ చేశారు. నీ ధైర్య సాహసాలు మమ్మల్ని మరింత సాహసవంతుల్ని చేశాయి అంటూ షారూక్ ట్వీట్ చేశాడు. ఇక సానియా మీర్జా, గౌతమ్ గంభీర్, సైనా నెహ్వాల్, వీరేంద్ర సెహ్వాగ్ తదితరులు అభినందన్‌కు స్వాగతం పలుకుతూ ట్వీట్లు చేశారు.