శంషాబాద్ సమీపంలో అర్థరాత్రి ఓ కారు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. ఎయిర్ పోర్టులో ప్రయాణికుడిని ఎక్కించుకుంటూ ఉండగా పోలీసులు రావడంతో.. భయపడిన కారు డ్రైవర్ హడావుడిగా కారును స్టార్ట్ చేశాడు. ఈ క్రమంలో యాదయ్య అనే ప్రయాణికుడి చొక్కా కారు డోర్‌లో ఇరుక్కుపోయింది. అది గమనించని డ్రైవర్ ఓవర్ స్పీడ్‌తో వెళిపోయాడు. దీంతో యాదయ్యను కారు ఈడ్చుకెళ్లింది. దాదాపు 8 కిలో మీటర్ల వరకూ వెళ్లింది. యాదయ్య ఎంత అరిచినా కారు స్పీడ్‌కి వినిపించలేదు. కారు డ్రైవర్ చేసిన బీభత్సానికి అతడు చనిపోయాడు. అప్పటికీ క్యాబ్ డ్రైవర్ గుర్తించలేదు. శంషాబాద్ టోల్ గేట్ వద్ద ఇతర వాహనదారులు గుర్తించి కేకలు వేయడంతో.. కారును అక్కడే వదిలి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.