అభినందన్‌కు నిర్వహించే టెస్ట్స్ ఏవంటే?

వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను పాక్‌ అధికారులు భారత్‌కు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆయనకు కొన్ని కీలకమైన వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. నిబంధనల ప్రకారం అతడు భారత్‌కు రాగానే విచారణ చేయనున్నారు. అటారీ చేరుకున్న అభినందన్‌ను భారత వైమానిక దళానికి చెందిన ఇంటెలిజెన్స్‌ యూనిట్‌కు తరలిస్తారు. అక్కడ ఆయనకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆయన ఫిట్‌నెస్‌ స్థాయి ఏ మేరకు ఉందనే దాన్ని పరీక్షిస్తారు. అనంతరం ఆయన శరీరంలో పాక్‌ ఆర్మీ ఏమైనా బగ్‌ను అమర్చిందా? […]

అభినందన్‌కు నిర్వహించే టెస్ట్స్ ఏవంటే?
Follow us

|

Updated on: Mar 01, 2019 | 7:11 PM

వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను పాక్‌ అధికారులు భారత్‌కు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆయనకు కొన్ని కీలకమైన వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. నిబంధనల ప్రకారం అతడు భారత్‌కు రాగానే విచారణ చేయనున్నారు. అటారీ చేరుకున్న అభినందన్‌ను భారత వైమానిక దళానికి చెందిన ఇంటెలిజెన్స్‌ యూనిట్‌కు తరలిస్తారు. అక్కడ ఆయనకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆయన ఫిట్‌నెస్‌ స్థాయి ఏ మేరకు ఉందనే దాన్ని పరీక్షిస్తారు. అనంతరం ఆయన శరీరంలో పాక్‌ ఆర్మీ ఏమైనా బగ్‌ను అమర్చిందా? అనేది తెలుసుకునేందుకు స్కానింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు.

అంతేకాదు.. ఆయన మానసిక పరిస్థితి, ఆలోచనా విధానం ఏ విధంగా ఉందో పరీక్షిస్తారు. అభినందన్‌ నుంచి సమాచారం రాబట్టేందుకు శత్రుదేశం అతడిని టార్చర్‌ చేసిందా? అనే విషయానికి సంబంధించి వివరాలను సేకరిస్తారు. ఇంకా ఏదైనా అవసరం అనిపిస్తే ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ), రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌(రా) అధికారులు ఆయన్ను ప్రశ్నించే అవకాశం లేకపోలేదు. సాధారణంగా ఐఏఎఫ్‌ అధికారిని ఐబీ, రా అధికారులు విచారించేందుకు అనుమతి లేదు. కానీ, క్లిష్టమైన కొన్ని కేసుల్లోనే ఈ విధంగా విచారణ చేయాల్సి ఉంటుంది. భారత్‌కు చెందిన వింగ్‌ కమాండర్‌ను పాక్‌ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. శాంతికి సంకేతంగా ఆయన్ను భారత్‌కు అప్పగించనున్నట్లు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నిన్న పార్లమెంట్‌లో ప్రకటించారు.

నారా రోహిత్‌ నయా సుందరకాండ | రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన 'రాబిన్‌ హుడ
నారా రోహిత్‌ నయా సుందరకాండ | రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన 'రాబిన్‌ హుడ
ఆ ఒక్క పనిచేస్తే చాలు.. సలార్ సినిమాలో ప్రభాస్ బైక్ గెలుచుకోవచ్చు
ఆ ఒక్క పనిచేస్తే చాలు.. సలార్ సినిమాలో ప్రభాస్ బైక్ గెలుచుకోవచ్చు
సిల్వర్ స్క్రీన్ అంతా రామ నామమే.. 2024 రానున్న సినిమాలు ఇవే
సిల్వర్ స్క్రీన్ అంతా రామ నామమే.. 2024 రానున్న సినిమాలు ఇవే
డార్లింగ్ నే నమ్ముకుంటున్న హీరోయిన్లు.! ప్రభాస్ మ్యాజిక్ అలాంటిది
డార్లింగ్ నే నమ్ముకుంటున్న హీరోయిన్లు.! ప్రభాస్ మ్యాజిక్ అలాంటిది
ఫ్యాన్స్ గెట్ రెడీ..పుష్ప 2 నుంచి మరో పవర్ ఫుల్ టీజర్..ఎప్పుడంటే?
ఫ్యాన్స్ గెట్ రెడీ..పుష్ప 2 నుంచి మరో పవర్ ఫుల్ టీజర్..ఎప్పుడంటే?
దూరమైంది నేనే..! నా సినిమాలు కాదు అంటున్న పవన్‌ కళ్యాణ్.!
దూరమైంది నేనే..! నా సినిమాలు కాదు అంటున్న పవన్‌ కళ్యాణ్.!
తాగే నీటిలో విషం కలిపి భార్య, ఇద్దరు పిల్లలను చంపిన భర్త..
తాగే నీటిలో విషం కలిపి భార్య, ఇద్దరు పిల్లలను చంపిన భర్త..
టాలీవుడ్ లక్కీ గర్ల్ సంయుక్త.. సమంత సలహా తీసుకున్నారా.?
టాలీవుడ్ లక్కీ గర్ల్ సంయుక్త.. సమంత సలహా తీసుకున్నారా.?
సీఎం జగన్‌పై దాడి కేసులో వెలుగులోకి సంచలనాలు.. పక్కా ప్లాన్‌తో..
సీఎం జగన్‌పై దాడి కేసులో వెలుగులోకి సంచలనాలు.. పక్కా ప్లాన్‌తో..
వాటర్ బాటిల్స్ అమ్మి.. హోటల్లో పనిచేసిన కుర్రాడు.. కట్ చేస్తే..
వాటర్ బాటిల్స్ అమ్మి.. హోటల్లో పనిచేసిన కుర్రాడు.. కట్ చేస్తే..