బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిస్ క్షిపణి సక్సెస్

|

Oct 18, 2020 | 1:28 PM

ఆధునీకరించిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ఇండియన్ నేవీ ఆదివారం విజయవంతంగా ప్రయోగించింది. బ్రహ్మోస్, సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఇండియన్ నేవీ...

బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిస్ క్షిపణి సక్సెస్
Follow us on

BRAHMOS missile test-fire success: ఆధునీకరించిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ఇండియన్ నేవీ ఆదివారం విజయవంతంగా ప్రయోగించింది. బ్రహ్మోస్, సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఇండియన్ నేవీ దేశీయంగా నిర్మించిన స్టీల్త్ డిస్ట్రాయర్‌ను ఐఎన్ఎస్ చెన్నై నుంచి ప్రయోగించగా.. అది అరేబియా సముద్రంలో లక్ష్యాన్ని చేధించింది.

క్షిపణి అధిక స్థాయిలో చాలా క్లిష్టమైన విన్యాసాలు చేసిన తర్వాత పిన్-పాయింట్ ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిందని డీఆర్డీఓ ప్రకటించింది. BRAHMOS ‘ప్రైమ్ స్ట్రైక్ ఆయుధం’ లాగా ఆదివారం ప్రయోగించిన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి నౌకాదళం ద్వారా సుదూరంలోని ఉపరితల లక్ష్యాలను చేధించడం ద్వారా యుద్ధనౌక యొక్క సామర్ధ్యాన్ని పెంచుతుంది.

ప్రయోగం విజయవంతం అయినందుకు ఛైర్మన్ డిఆర్డిఓ డాక్టర్ జి సతీష్ రెడ్డి, శాస్త్రవేత్తలు మరియు డిఆర్డిఓ, బ్రహ్మోస్, ఇండియన్ నేవీ సిబ్బందిని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందించారు. బ్రహ్మోస్ క్షిపణులు భారత సాయుధ దళాల సామర్థ్యాలను అనేక విధాలుగా పెంచుతాయని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.

Also read: గ్రేటర్ పరిధిలో పలు రోడ్లు మూసివేత.. ఇవే ఆ రోడ్లు