బొత్స మళ్ళీ మెలిక పెట్టేశారు.. ఈసారి రాజధాని సంగతేంటంటే?

|

Dec 14, 2019 | 4:56 PM

ఏపీ మంత్రి బొత్స మాటల్లో అర్థం, అంతరార్థం తెలుసుకోవడం ఇపుడు ప్రజలకు సవాల్ మారింది. శుక్రవారం రాజధానిని అమరావతి నుంచి మార్చే ఉద్దేశం ఏమీ ప్రభుత్వానికి లేదని చెప్పిన మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం మరో ట్విస్టు ఇచ్చారు. అసెంబ్లీలో పరిస్థితిని బట్టి మాట్లాడానంటూ.. రాజధాని మార్చాలా వద్దా అనే అంశంపై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తాజాగా మరో ప్రకటన చేశారు. అమరావతి, రాజధాని నిర్మాణం, సంబంధిత అంశాల పరిశీలనకు నియమించిన టెక్నికల్ కమిటీ […]

బొత్స మళ్ళీ మెలిక పెట్టేశారు.. ఈసారి రాజధాని సంగతేంటంటే?
Follow us on

ఏపీ మంత్రి బొత్స మాటల్లో అర్థం, అంతరార్థం తెలుసుకోవడం ఇపుడు ప్రజలకు సవాల్ మారింది. శుక్రవారం రాజధానిని అమరావతి నుంచి మార్చే ఉద్దేశం ఏమీ ప్రభుత్వానికి లేదని చెప్పిన మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం మరో ట్విస్టు ఇచ్చారు. అసెంబ్లీలో పరిస్థితిని బట్టి మాట్లాడానంటూ.. రాజధాని మార్చాలా వద్దా అనే అంశంపై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తాజాగా మరో ప్రకటన చేశారు.

అమరావతి, రాజధాని నిర్మాణం, సంబంధిత అంశాల పరిశీలనకు నియమించిన టెక్నికల్ కమిటీ ఇచ్చే నివేదికపై ఆధారపడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని బొత్స విశాఖలో చెప్పుకొచ్చారు. సభలోనే అనుబంధ ప్రశ్నలు వేసి వుంటే మరింత క్లారిటీ ఇచ్చేవాడినని బొత్స అంటున్నారు. రాజధానిని మార్చే ఉద్దేశం వుందా అన్నది మండలిలో తనను అడిగిన ప్రశ్న అని.. ఆ జవాబు చెప్పే నాటికి రాజధానిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోనందున తాను ‘‘ లేదు ‘‘ అన్న సమాధానం చెప్పానని ఆయనంటున్నారు.

అనుబంధ ప్రశ్నలు వేసి వుంటే.. రాజధాని విషయంలో నియమించిన కమిటీ ప్రస్తావన వచ్చి వుండేదని, దాంతో తన ప్రకటనపై మరింత క్లారిటీ వచ్చేదని బొత్స అంటున్నారు. సో.. రాజధాని మార్చే అంశం ఇంకా ముఖ్యమంత్రి జగన్ పరిశీలనలో వుందనే విషయం బొత్స మాటలతో తేటతెల్లమైంది.

దురదృష్టవశాత్తు ప్రతిపక్ష టిడిపి సభను సజావుగా జరగనీయట౦ లేదని బొత్స అంటున్నారు. ఏదో ఒక వంకతో సభను ఆటంక పరచాలని చూస్తున్నారని, అసభ్య పదజాలాన్ని వాడుతున్నారని, మార్షల్స్ పైనా దుర్భాషలాడుతున్నారని బొత్స ఆరోపించారు. రాష్ట్రంలోని 109 మున్సిపాలిటీలకు ఫిబ్రవరిలో ఎన్నికలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు. విశాఖ మెట్రో రైలు ని రెండు ఫేజ్ లలొ చేపడుతున్నామని ఆయన ప్రకటించారు. త్వరలోనే మెట్రోరైలు ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన చేస్తారని మంత్రి వివరించారు.